Josh Hazlewood Injury : ఆస్ట్రేలియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్.. తన గాయం కారణంగా రానున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆదివారం వెల్లడించింది. మరో మూడు రోజుల్లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఈ సమయంలో ఈ వార్త ఆసిస్ టీమ్‌తో పాటు క్రికెట్ అభిమానులను కుదిపేసింది.
అయితే కొంత కాలంగా మోకాలు, మడమ గాయంతో బాధపడుతున్న జోష్ హేజిల్‌వుడ్.. ఇండియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆడలేదు. ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా చాలా మ్యాచులకు దూరంగా ఉన్న జోష్.. మూడు మ్యాచులు ఆడినప్పటికీ.. గాయం కారణంగా మళ్లీ టీమ్‌కు దూరమయ్యాడు.
కాగా హేజిల్‌వుడ్ గాయం నుంచి పూర్తిగా కోలుకుంటాడని.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఆడతాడని కొన్ని రోజుల క్రితం క్రికెట్ ఆస్ట్రేలియా కీలక ప్రకటన చేసింది. అయితే ఫైనల్ మ్యాచ్‌కి ముందు నిర్వహించిన పరీక్షల్లో కూడా హేజిల్‌వుడ్ గాయం తగ్గకపోవడం వల్ల అతన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. విశ్రాంతి తీసుకునేందుకు జట్టు నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది క్రికెట్ ఆస్ట్రేలియా. దీంతో అతను ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లనున్నాడు. మరోవైపు ఈ నెలలో జరిగే యాషెస్ సిరీస్ సమయానికి అతను పూర్తిగా కోలుకుంటే.. తిరిగి ఇంగ్లాండ్‌కి వస్తాడు. ఈ క్రమంలో జోష్ హేజిల్‌వుడ్ ప్లేస్‌లో ఆల్‌రౌండర్ మైకేల్ నేసర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా.. తుది జట్టులో ఆడేందుకు అవకాశం కల్పించనుందని టాక్.
ఇక మైకేల్ నేసర్ కెరీర్‌ను చూస్తే.. 33 ఏళ్ల మైకేల్ నేసర్ ఇప్పటిదాకా ఆస్ట్రేలియా తరఫున 2 టెస్టులు, 2 వన్డేలు మాత్రమే ఆడాడు. 2 టెస్టుల్లో 7 వికెట్లు తీసిన మైకేల్..వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది ప్యాట్ కమ్మిన్స్ కరోనా బారిన పడటం వల్ల 2021 యాషెస్ సిరీస్‌లో ఓ టెస్టు ఆడిన నేసర్, 2022 డిసెంబర్‌లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు.ఇక ఐపీఎల్ 2013 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన నేసర్.. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు తీసి అదరగొట్టాడు.
ఆస్ట్రేలియా తుది జట్టు : స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, మార్నస్ లబుషేన్, ఉస్మాన్ ఖవాజా, స్కాట్ బోలాండ్, స్టీవ్ స్మిత్, మార్కస్ హారీస్, జోష్ ఇంగ్లీష్, నాథన్ లియాన్, టాడ్ ముర్ఫీ, మైకేల్ నేసర్, మిచెల్ స్టార్క్
-
Michael Neser could play his first Test away from home in the #WTC23 final 😯
— ICC (@ICC) June 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
More 👉 https://t.co/Gt7XgKrjac pic.twitter.com/8Kkt7SIfCX
">Michael Neser could play his first Test away from home in the #WTC23 final 😯
— ICC (@ICC) June 4, 2023
More 👉 https://t.co/Gt7XgKrjac pic.twitter.com/8Kkt7SIfCXMichael Neser could play his first Test away from home in the #WTC23 final 😯
— ICC (@ICC) June 4, 2023
More 👉 https://t.co/Gt7XgKrjac pic.twitter.com/8Kkt7SIfCX