ETV Bharat / sports

ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆసీస్​ స్వలింగ క్రికెటర్ జంట - మేగాన్​ స్కట్​- జెస్​ హోలియోక్​ జంట

ఆస్ట్రేలియా స్వలింగ జంట మేగాన్​ స్కట్​- జెస్​ హోలియోక్​కు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని ఆసీస్​ మహిళ క్రికెటర్​ మేగాన్​ ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

Megan Schutt
మేగాన్ స్కట్
author img

By

Published : Aug 22, 2021, 9:45 AM IST

స్వలింగ వివాహంతో ఒక్కటైన ఆసీస్​ మహిళా క్రికెటర్​ మేగాన్​ స్కట్​- జెస్​ హోలియోక్​ జంటకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఎమర్జెన్సీ సీ- సెక్షన్​ పద్ధతిలో ఆగస్టు 17న చిన్నారి పుట్టినట్లు స్కట్​ ట్విట్టర్​లో వెల్లడించింది. ​రిలీ లూయిస్​ స్కట్ అనే పాపకు పేరు పెట్టినట్లు చెప్పింది. ఆ పాప 858 గ్రాముల బరువు ఉన్నట్లు పేర్కొంది. ​​ఆ చిన్నారితో తీసుకున్న పలు ఫొటోలను షేర్​ చేసింది.

"ఎమర్జెన్సీ సీ- సెక్షన్​ ద్వారా మాకు పాప పుట్టింది. దీంతో 28 వారాల మా నిరీక్షణకు తెరపడింది. నా జీవితంలో ఈ ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉండడం నా అదృష్టం" అని మేగాన్ ట్విట్టర్​లో పేర్కొంది.

ఆస్ట్రేలియాలో కొన్నేళ్ల క్రితం స్వలింగ వివాహాలు చట్టబద్దం చేశారు. దీంతో ఈ జంట 2019 మార్చిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. 2021 మేలో తన భార్య గర్భం దాల్చినట్లు మేగాన్​ ప్రకటించింది. నవంబర్​లో తమ కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నట్లు వెల్లడించింది.

శుభాకాంక్షల వెల్లువ..

స్కట్​- జెస్​ దంపతులకు పాప జన్మించడం వల్ల ఆ జంటకు చాలా మంది విషెస్​ చెబుతున్నారు. ఆసీస్​ పేసర్​ లారెన్ చీట్లే, ఆసీస్​ క్రికెటర్​ లీసా స్థలేకర్​, న్యూజిలాండ్ మహిళ జట్టు కెప్టెన్ అమీ సత్తెర్వైట్​, న్యూజిలాండ్ పేసర్​ లీ టహుహు.. శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.

2012లో ఆసీస్​ జట్టులోకి వచ్చిన మేగాన్​.. ఇప్పటివరకు 65 వన్డేలు (99 వికెట్లు), 73 టీ20లు (96 వికెట్లు) ఆడింది. ఆసీస్ గతేడాది జరిగిన​ టీ20 ప్రపంచకప్​ గెలవడంలో మేగాన్​ కీలకపాత్ర పోషించింది. 13 వికెట్లు తీసి టోర్నీలో ఎక్కువ వికెట్లు పడగొట్టిన ప్లేయర్​గా నిలిచింది.

ఇదీ చదవండి: బిడ్డకు జన్మనివ్వనున్న స్వలింగ జంట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.