రానున్న ఐపీఎల్ కోసం దిల్లీ క్యాపిటల్స్ తమ కొత్త సారథలను పరిచయం చేసింది. గత సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి.. ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో ఇప్పుడు డేవిడ్ వార్నర్ జట్టును నడిపించనున్నాడు. ఇక వైస్ కెప్టెన్‌గా టీమ్ ఇండియా ప్లేయర్ అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు.
అయితే దిల్లీ టీమ్‌కు వార్నర్ కెప్టెన్‌గా వ్యవహరించడం ఇదేం తొలి సారి కాదు. వార్నర్ తన ఐపీఎల్ కెరీర్‌ను ఈ టీమ్‌తోనే ప్రారంభించాడు. 2009 నుంచి 2013 వరకు అప్పటి దిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్‌లో ఉన్న వార్నర్.. ఆ సమయంలో పలు మ్యాచ్‌లకు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.
ఆ తర్వాత 2014లో సన్‌రైజర్స్ టీమ్ అతన్ని కొనుగోలు చేసింది. పలు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్.. 2016లో జట్టుకు ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. అలా ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్స్‌లో ఒకరిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.
-
David Warner 👉🏼 (𝗖)
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Axar Patel 👉🏼 (𝗩𝗖)
All set to roar loud this #IPL2023 under the leadership of these two dynamic southpaws 🐯#YehHaiNayiDilli | @davidwarner31 @akshar2026 pic.twitter.com/5VfgyefjdH
">David Warner 👉🏼 (𝗖)
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023
Axar Patel 👉🏼 (𝗩𝗖)
All set to roar loud this #IPL2023 under the leadership of these two dynamic southpaws 🐯#YehHaiNayiDilli | @davidwarner31 @akshar2026 pic.twitter.com/5VfgyefjdHDavid Warner 👉🏼 (𝗖)
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023
Axar Patel 👉🏼 (𝗩𝗖)
All set to roar loud this #IPL2023 under the leadership of these two dynamic southpaws 🐯#YehHaiNayiDilli | @davidwarner31 @akshar2026 pic.twitter.com/5VfgyefjdH
దిల్లీ జట్టుకు చేరుకున్నా దాదా.. డైరెక్టర్‌గా పగ్గాలు..
ఇక జట్టు సారథుల పేర్లను ప్రకటించిన దిల్లీ టీమ్.. తమ ఫ్రాంచైజీకి డైరెక్టర్‌గా మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేరును ఖరారు చేసింది. పురుషల, మహిళల ప్రీమియర్ లీగ్ దిల్లీ జట్లతో పాటు ఫ్రాంచైజీకి సంబంధించిన అన్ని టీమ్‌లకు ఈయనే బాధ్యతలు వహించనున్నారని తెలిపింది.
-
🚨 ANNOUNCEMENT 🚨
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Sourav Ganguly returns to Delhi Capitals as our Director of Cricket for #TATAIPL2023 🤝🏻
Welcome Back, Dada 💙❤️ @SGanguly99 pic.twitter.com/veUUc7fqBy
">🚨 ANNOUNCEMENT 🚨
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023
Sourav Ganguly returns to Delhi Capitals as our Director of Cricket for #TATAIPL2023 🤝🏻
Welcome Back, Dada 💙❤️ @SGanguly99 pic.twitter.com/veUUc7fqBy🚨 ANNOUNCEMENT 🚨
— Delhi Capitals (@DelhiCapitals) March 16, 2023
Sourav Ganguly returns to Delhi Capitals as our Director of Cricket for #TATAIPL2023 🤝🏻
Welcome Back, Dada 💙❤️ @SGanguly99 pic.twitter.com/veUUc7fqBy
ముంబయి వీధుల్లో గల్లీ క్రికెట్ ఆడుతూ..
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో గాయపడ్డ ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం టీమ్ఇండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం రెడీ అవుతున్నాడు. ఇక మ్యాచ్ కోసం ముంబయి చేరుకున్న వార్నర్.. తన అభిమానులతో కలిసి నగర వీధుల్లో విహరించాడు. రోడ్డుపై క్రికెట్ ఆడాడు. ఆ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసిన వార్నర్ .. 'సైలెంట్‌గా ఉన్న వీధి ఒకటి దొరికింది. అందుకే ఇలా' అంటూ క్యాప్షన్‌ను జోడించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్‌తో ఆసిస్‌కు జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లలో తొలి రెండు మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. ఆ రెండు మ్యాచుల్లోనూ పెద్దగా రాణించలేకపోయాడు. అయితే దిల్లీ వేదికగా జరిగిన రెండో టెస్టులో అతనికి గాయమైంది. దీంతో మిగిలిన మ్యాచులకు దూరమయ్యాడు వార్నర్.
ఇక డేవిడ్ వార్నర్ తన ఆటతో పాటు ఇన్‌స్టా రీల్స్‌తో ఎప్పుడూ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాడు. ఫేమస్ పాటలకు స్టెప్పులేస్తూ పలు వీడియోలను షేర్ చేసి నెట్టింట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఫేస్ మార్ఫింగ్ చేసి సరదాగా అప్పుడప్పుడు పలు వీడియోలను పెట్టి అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్‌గా ఉంటూ జట్టుకు ట్రోఫీ అందేలా చేసిన అతన్ని అర్ధంతరంగా జట్టులో నుంచి తొలగించింది యాజమాన్యం. ఆ తర్వాత దిల్లీ జట్టులోకి చేరుకున్నాడు వార్నర్.