అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో పలువురు క్రికెటర్లు విధ్వంసకరమైన బ్యాటింగ్ చేయడం చూశాం. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన సందర్భాలూ ఉన్నాయి. అయితే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ దేశవాళీ క్రికెటర్(Sam Harrison Cricketer) ఇప్పటివరకు ఎప్పుడూ చూడని ఇన్నింగ్స్ ఆడాడు. ఒకే ఓవర్లో ఏకంగా 8 సిక్సర్లు బాదాడు.
ఆస్ట్రేలియా సొరెంటో డన్ క్రయాగ్ సీనియర్ క్లబ్‌కు చెందిన సామ్ హారిసన్(Sam Harrison Cricket) 8 వరుస సిక్సర్లు కొట్టి అరుదైన ఘనత సాధించాడు. నాథన్ బెనెట్ వేసిన ఓవర్లో ఈ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు హారిసన్. అయితే.. ఈ ఓవర్లో నాథన్ రెండు నో బాల్స్ వేశాడు. ఆ రెండు బంతులను కూడా సామ్ సిక్సర్లుగా మలచడం విశేషం.
మ్యాచ్ 39వ ఓవర్లో ఈ ఫీట్‌ను సాధించి అర్ధసెంచరీ పూర్తి చేసుకుని 80 పరుగుల వద్ద నిలిచాడు సామ్. అనంతరం 40వ ఓవర్లో మరో 22 పరుగులు సాధించి సెంచరీ పూర్తి చేశాడు. అయితే.. ఓ మ్యాచ్‌లో ఓ బ్యాట్స్‌మన్ 36 కన్నా ఎక్కువ పరుగులు చేయడం ఇదేం తొలిసారి కాదు. న్యూజిలాండ్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో బెర్ట్ వాన్స్ ఒకే ఓవర్లో 77 పరుగులు సాధించాడు.
ఇదీ చదవండి: