టీ20 ప్రపంచకప్‌లో (T20 world cup 2021) భాగంగా సూపర్-12 పోటీలు నేటి(అక్టోబర్ 23) నుంచి ప్రారంభంకానున్నాయి. అబుదాబిలోని షేక్ జావేద్ మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా.. దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జట్ల బలాలు, బలహీనతలేంటో తెలుసుకుందాం..
ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా
టీ20 రికార్డుల్లో దక్షిణాఫ్రికా జట్టుపై పైచేయి సాధించింది ఆస్ట్రేలియా. ఇప్పటివరకూ ఇరు జట్లు 22 టీ20 మ్యాచ్‌లు ఆడగా ఆసీస్ జట్టు పదమూడింటిలో గెలిచింది. దక్షిణాఫ్రికా జట్టు 8 విజయాలను తమ ఖాతాలో వేసుకుంది. వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఒక్కసారే తలపడ్డాయి. ఆ ఒక్క మ్యాచ్‌లోనూ ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయదుందుభి మోగించింది.
ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దక్షిణాఫ్రికా జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఆ జట్టుతో ఆడిన మ్యాచ్‌ల్లో వార్నర్ 457 పరుగులు చేశాడు. తర్వాత స్థానంలో ఆరోన్ ఫించ్(295) ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ జట్టుకు బలంగా మారనున్నారు. దక్షిణాఫ్రికా జట్టులో క్వింటన్ డికాక్(351 పరుగులు), కగిసొ రబాడ (8 వికెట్లు) కీలక ఆటగాళ్లు.
మధ్యాహ్నం 3.30 గంటలకు అబుదాబి వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
వెస్టిండీస్ X ఇంగ్లాండ్
గత టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు టాప్-2 స్థానాల్లో ఉన్నప్పటికీ ఈ ప్రపంచకప్‌లో వాటికి చేదు అనుభవం ఎదురైంది. ఇంగ్లాండ్ రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో ఒకే మ్యాచ్ గెలవగా, వెస్టిండీస్ రెండు వార్మప్ మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది.
ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ 11-7తో ఇంగ్లాండ్‌పై అధిక్యంలో ఉంది. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ 5 సార్లు విజయం సాధించగా.. ఇంగ్లాండ్ ఒక్కసారి కూడా గెలవకపోవడం గమనార్హం.
ఇంగ్లాండ్‌పై 13 ఇన్నింగ్స్‌లో 409 పరుగులు చేశాడు వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్. ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 12 ఇన్నింగ్స్‌ల్లో 221 పరుగులు నమోదు చేశాడు. ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఇంగ్లాండ్‌తో ఆడిన 12 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీయగా.. ఇంగ్లాండ్ ఆటగాడు అదిల్ రషీద్ 7 మ్యాచ్‌ల్లోనే 11 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో వీరంతా కీలక ఆటగాళ్లుగా నిలవనున్నారు.
రాత్రి 7.30 గంటలకు దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఇదీ చదవండి: