Australia Vs Pakistan Test : వరల్డ్ కప్ ఓటమి తర్వాత తమ సత్తా చాటేందుకు పాకిస్థాన్ జట్టు మైదానంలోకి దిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఈ జట్టు అక్కడి ప్లేయర్లతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అయితే ఫామ్ లేమి కారణంగా అటు బ్యాట్స్‌మెన్‌గానీ, బౌలర్లుగానీ మంచి ఫలితాలను అందుకోలేకపోతున్నారు. దీంతో పాక్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన పాక్ క్రికెట్ అభిమానులు మరింత నిరాశను వ్యక్తం చేస్తున్నారు.
వన్ బాల్ - 5 రన్స్!
టెస్ట్ సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య పోరు జరుగుతోంది. అయితే ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా క్రీజులో ప్యాట్ కమ్మిన్స్, వికెట్ కీపర్ అలెక్స్ కేరీలు బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ బౌలర్ జమాల్ వేసిన ఓ బంతిని కమ్మిన్స్ షాట్ ఆడాడు. ఆ బాల్ కాస్త ఇద్దరు ఫీల్డర్ల మధ్యలో నుంచి వెళ్లింది. అయితే ఆ బాల్‌ను ఆపి బౌలర్ వైపు త్రో చేశాడు పాక్ ఫీల్డర్. కానీ దాన్ని పట్టుకోవడంలో షాహీన్ అఫ్రిది విఫలం కావడం వల్ల ఆ బంతి కాస్త బౌండరీ వైపుకు దూసుకెళ్లింది. అప్పటికే క్రీజులో ఉన్న ఆ ఇద్దరూ రెండు పరుగులు పూర్తి చేశారు. అంతలో మిస్ ఫీల్డ్ కావడంతో వల్ల మరో మూడు పరుగులు పూర్తిచేశారు. అలా మెుత్తానికి ఒక్క బాల్‌కు ఐదు పరుగులు వచ్చాయి.
-
5 runs in one ball without any boundaries or no ball. pic.twitter.com/Hzcbrl3ZK2
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">5 runs in one ball without any boundaries or no ball. pic.twitter.com/Hzcbrl3ZK2
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 20235 runs in one ball without any boundaries or no ball. pic.twitter.com/Hzcbrl3ZK2
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2023
ఇలా పేలవ ఫామ్‌ను కనబరిచిన పాక్ ప్లేయర్లపై నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మ్యాచ్‌లో అబ్దుల్లా షఫీక్ మూడు క్యాచ్‌లను వదిలిపెట్టి తన జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. ఇలా క్యాచ్‌లు వదిలేయడం పాక్ జట్టుకు చాలా నష్టాన్ని చేకూర్చింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 318 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 262 రన్స్ స్కోర్ చేసింది. మరోవైపు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 264 రన్స్ స్కోర్ చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 237 పరుగులు చేసి 79 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.
పాకిస్థాన్ ప్లేయర్లకు అవమానం- ఆస్ట్రేలియా అంత పని చేసిందా?