Australia Tour Of India 2023 Team India Squad : ఆస్ట్రేలియాతో నవంబర్ 23 నుంచి జరగనున్న టీ20 సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా భారత జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ బోర్డు- బీసీసీఐ. రుతురాజ్ గైక్వాడ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది. ఇక ఇటీవల వరల్డ్ కప్ స్క్వాడ్ నుంచి సూర్యకుమార్‌తో పాటు ప్రిసిద్ధ్ కృష్ణ, ఇషాన్ కిషన్‌ను తీసుకుంది. వరల్డ్ కప్‌తో అలసి పోయిన శ్ర్రేయస్ అయ్యర్‌కు మూడు మ్యాచ్‌ల వరకు రెస్ట్ ఇచ్చింది. అయితే అయ్యర్ డిసెంబర్ 3న రాయ్‌పుర్‌లో జరిగే మ్యాచ్‌లో వైస్ కెప్టెన్‌గా రాయ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (WK), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్
ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ ఇండియా షెడ్యూల్- టీ20 సిరీస్
క్ర.సం. | తేదీ | మ్యాచ్ | వేదిక |
1 | నవంబర్ 23 | 1వ T20I | విశాఖపట్నం |
2 | నవంబర్ 26 | 2వ T20I | తిరువనంతపురం |
3 | నవంబర్ 28 | 3వ T20I | గువాహటి |
4 | డిసెంబర్ 1 | 4వ T20I | రాయ్‌పుర్ |
5 | డిసెంబర్ 3 | 5వ T20I | బెంగళూరు |
Australia Squad For India T20 Series 2023 : అయితే ఈ టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్టు ఇప్పటికే 15 మందితో జట్టును ప్రకటించింది. కీపర్ మాథ్యూ వేడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. జట్టులో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపాలు ఉన్నారు. వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, కెమెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్‌లకు ఆసీస్ క్రికెట్ బోర్డు రెస్ట్ ఇచ్చింది.
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినీస్, జాష్ ఇంగ్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్.
భారత అభిమానులపై మ్యాక్స్‌వెల్ భార్య ఫైర్- మీ ఆగ్రహాన్ని వాటిపై చూపించండి అంటూ!
వరల్డ్ కప్ 2023 టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ- ఆ జట్టులో ఆరుగురు మనోళ్లే!