AUS VS PAK Test 2023 : సాధారణంగా క్రికెట్‌లో వర్షం, వెలుతురు లేమి, సాంకేతిక కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోవడం చూస్తూ ఉంటాం. కానీ మెల్‌బోర్న్ వేదికగా పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఊహించని ఘటనతో ఆటకు అంతరాయం ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా వ్యవహరిస్తున్న రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడు
దీంతో దాదాపు ఐదు నిమిషాల పాటు మ్యాచ్ ఆగిపోయింది. మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి ఆటను ప్రారంభించేందుకు అన్‌ఫీల్డ్ అంపైర్లు సిద్దమయ్యారు. ఈ క్రమంలో కెమెరామెన్ థర్డ్ అంపైర్ బాక్స్ వైపు కెమెరాను టర్న్ చేయగా సీటులో ఇల్లింగ్ వర్త్ కన్పించలేదు. దీంతో ఆటను అంపైర్‌లు ప్రారంభించలేదు.
వెంటనే ఈ విషయాన్ని ఫోర్త్ అంపైర్‌కు ఫీల్డ్ అంపైర్‌లు తెలియజేయగా అతడు ఏమైందోనని థర్డ్ అంపైర్ గదికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. ఇంతలోనే లంచ్ పూర్తి చేసిన తర్వాత ఇల్లింగ్ వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయాడని కామెంటేటర్‌లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆసీస్ ఆటగాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. అయితే ఐదు నిమిషాల తర్వాత థర్డ్ అంపైర్ తిరిగి రావడంతో మ్యాచ్ ప్రారంభమైంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
A wild Richard Illingworth appeared! #AUSvPAK pic.twitter.com/7Rsqci4whn
— cricket.com.au (@cricketcomau) December 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A wild Richard Illingworth appeared! #AUSvPAK pic.twitter.com/7Rsqci4whn
— cricket.com.au (@cricketcomau) December 28, 2023A wild Richard Illingworth appeared! #AUSvPAK pic.twitter.com/7Rsqci4whn
— cricket.com.au (@cricketcomau) December 28, 2023
పాక్ ఖాతాలో చెత్త రికార్డు
టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 52 పరుగులను ఎక్స్‌ట్రాల రూపంలో ఇచ్చింది. ఈ క్రమంలో ఓ చెత్త రికార్డును నమోదు చేసింది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఓ టెస్టు మ్యాచ్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జట్టుగా పాక్ అపఖ్యాతి మూటగట్టుకుంది. ఎక్స్‌ట్రాస్‌లో 15 వైడ్‌లు, 20 బైలు, 2 నోబాల్స్ ఉన్నాయి. 1995 నుంచి పాకిస్థాన్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెలవలేదు. మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ప్రస్తుతం ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో టెస్టు మ్యాచులో సైతం ఆస్ట్రేలియా క్రమంగా పట్టు బిగిస్తోంది.