Aus vs Ned World Cup 2023 : 2023 ప్రపంచకప్‌లో దిల్లీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా - నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఆసీస్ విధ్వంసం సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. స్టార్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్ (104), మ్యాక్స్‌వెల్ (106) నెదర్లాండ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. స్టీవ్ స్మిత్ (71), మార్నస్ లబూషేన్ (62) రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో లోగన్ వాన్ బీక్ 4, బస్ ది లీడ్ 2, ఆర్యన్ దత్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
మొదట్లో వార్నర్.. ఆఖర్లో మ్యాక్స్‌వెల్.. ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక.. 3.5 వద్ద ఓపెనర్ మిచెల్ మార్ష్ (9) క్యాచౌట్ అయ్యాడు. మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టుకు ఇదే ఏకైక సంబరం. తర్వాత వచ్చిన బ్యాటర్లు.. వచ్చినట్టే చెలరేగిపోయారు. మొదట్లో వార్నర్ మెరుపులు మెరిపించగా.. ఆఖర్లో మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లోనే 8 సిక్స్‌లు, 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసి ఔరా అనిపించాడు. అయితే వరల్డ్‌కప్ హిస్టరీలో ఇదే వేగవంతమైన శతకం కావడం విశేషం. చివరి ఓవర్లో మ్యాక్స్‌వెల్.. భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
-
Glenn Maxwell has smashed the record for the fastest @cricketworldcup hundred in some style 💥@mastercardindia Milestones 🏏#CWC23 #AUSvNED pic.twitter.com/ntxbFlynOE
— ICC (@ICC) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Glenn Maxwell has smashed the record for the fastest @cricketworldcup hundred in some style 💥@mastercardindia Milestones 🏏#CWC23 #AUSvNED pic.twitter.com/ntxbFlynOE
— ICC (@ICC) October 25, 2023Glenn Maxwell has smashed the record for the fastest @cricketworldcup hundred in some style 💥@mastercardindia Milestones 🏏#CWC23 #AUSvNED pic.twitter.com/ntxbFlynOE
— ICC (@ICC) October 25, 2023
వరల్డ్‌కప్‌లో టాప్ 5 ఫాస్టెస్ట్ సెంచరీలు..
- గ్లెన్ మ్యాక్స్‌వెల్ VS నెదర్లాండ్స్ 2023 (40 బంతుల్లో)
- మర్క్రమ్ VS శ్రీలంక 2023 (49 బంతుల్లో)
- కెవిన్ ఒబ్రెయిన్ VS శ్రీలంక (50 బంతుల్లో)
- గ్లెన్ మ్యాక్స్‌వెల్ VS శ్రీలంక 2015 (51 బంతుల్లో)
- ఏబీ డివిలియర్స్ VS వెస్టిండీస్ 2015.
వార్నర్@6.. ఈ మెగాటోర్నీలో డాషింగ్ బ్యాటర్ వార్నర్ అద్భుత ఫామ్‌తో చెలరేగిపోతున్నాడు. ఇప్పటికే ఐదు మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 66.40 సగటుతో రెండు సెంచరీలు సహా.. 332 పరుగులు చేశాడు. ఇక టర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన లిస్ట్‌లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక తాజా సెంచరీతో వార్నర్.. ప్రపంచకప్‌లో ఆరుసార్లు 100+ స్కోర్లు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా తరఫున వరల్డ్‌కప్‌లో అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఇదివరకు ఈ రికార్డు ఆసీస్ మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్ పేరిట ఉండేది.
-
David Warner is inevitable 💯 Back-to-back centuries for the Australian opener 👏@mastercardindia Milestones 🏏#CWC23 #AUSvNED pic.twitter.com/sr4Sn9xHPi
— ICC (@ICC) October 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">David Warner is inevitable 💯 Back-to-back centuries for the Australian opener 👏@mastercardindia Milestones 🏏#CWC23 #AUSvNED pic.twitter.com/sr4Sn9xHPi
— ICC (@ICC) October 25, 2023David Warner is inevitable 💯 Back-to-back centuries for the Australian opener 👏@mastercardindia Milestones 🏏#CWC23 #AUSvNED pic.twitter.com/sr4Sn9xHPi
— ICC (@ICC) October 25, 2023
Aus vs Pak World Cup 2023 : వార్నర్ ఇన్నింగ్స్ 'తగ్గేదేలే'.. పాకిస్థాన్ ముందు కొండంత లక్ష్యం