AUS vs ENG: ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్టులో విజయం సాధించి 4-0 తేడాతో యాషెస్ సిరీస్ సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా. అయితే.. గెలిచిన ఆనందంలో ఆసీస్ ఆటగాళ్లు, ఓడిన బాధలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కలిసి పార్టీ చేసుకున్నారు. హోబర్ట్‌లోని ఓ హోటల్లో శ్రుతిమించి తాగి పోలీసులు వార్నింగ్ ఇచ్చే పరిస్థితి కొని తెచ్చుకున్నారు.
ఇదీ జరిగింది..
ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్, పేసర్ జేమ్స్ అండర్సన్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు అలెక్స్ క్యారీ, నాథన్ లయాన్, ట్రావిస్ హెడ్ సహా పలువురు ఆటగాళ్లు హోటల్లో హద్దుమీరి తాగి అల్లరి చేశారు. దీంతో హోటల్ దగ్గరకు చేరుకున్న పోలీసులు..'అల్లరి మరీ ఎక్కువైంది. మీరు ఇబ్బంది పెడుతున్నారంటూ కంప్లైంట్ వచ్చింది. అందుకే మేం ఇక్కడకు వచ్చాం' అని వార్నింగ్ ఇచ్చారు. 'పడుకునే టైమ్ అయింది. వెళ్లి నిద్రపోండి' అని ఆటగాళ్లకు చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే.. ఆటగాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు స్పష్టం చేశారు.
-
The first and last time #Hobart will host an #Ashes test… ‘Bit too loud’ .. Awesome pic.twitter.com/zdZ4dmcsf6
— Matt de Groot (@mattdegroot_) January 18, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">The first and last time #Hobart will host an #Ashes test… ‘Bit too loud’ .. Awesome pic.twitter.com/zdZ4dmcsf6
— Matt de Groot (@mattdegroot_) January 18, 2022The first and last time #Hobart will host an #Ashes test… ‘Bit too loud’ .. Awesome pic.twitter.com/zdZ4dmcsf6
— Matt de Groot (@mattdegroot_) January 18, 2022
ఇదీ చదవండి:
Ashes 2021: ఉత్కంఠరేపిన నాలుగో టెస్టు.. చివరికి డ్రా
ఆఖరి టెస్టులోనూ ఇంగ్లాండ్ చిత్తు.. 4-0తో 'యాషెస్' ఆసీస్ కైవసం