ETV Bharat / sports

Asian Games Cricket Gold Medalist : ఫైనల్స్​లో లంకపై భారత్​ జయకేతనం.. ఆ ఘనత సాధించిన తొలి జట్టుగా.. - team india womens cricket team asia games 2023

Asian Games Cricket Gold Medalist : ఆసియా క్రీడల్లో క్రికెట్ విభాగంలో భారత మహిళల జట్టు గోల్డ్​ మెడల్ సాధించింది. ఈ విజయంతో టీమ్ఇండియా ప్లేయర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

Asian Games Cricket Gold Medalist
Asian Games Cricket Gold Medalist
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 3:59 PM IST

Updated : Sep 25, 2023, 6:18 PM IST

Asian Games Cricket Gold Medalist : 2023 ఆసియా క్రీడల్లో భారత మహిళలు క్రికెట్ విభాగంలో చరిత్ర సృ ష్టించారు. సోమవారం శ్రీలంతో జరిగిన ఫైనల్స్​లో 19 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి.. పసిడిని ముద్దాడారు. దీంతో క్రికెట్ పోటీల్లో స్వర్ణ పతకం గెలిచిన తొలి జట్టుగా భారత్​ నిలిచింది. ఈ విజయంతో మహిళల జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ సహా పలువురు ప్రముఖులు ట్విట్టర్ వేదికగా.. టీమ్ఇండియా మహిళా ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

  • IT'S A GOLD 🥇

    Congratulations to our Women's Cricket Team on their astounding debut at the #AsianGames and bring home 🇮🇳's 1st-ever GOLD in Cricket!!

    Valiant effort and terrific fielding from the #WomenInBlue, rising from the ashes and leaving cricket fans at the edge of… pic.twitter.com/U8NX4hr55E

    — Anurag Thakur (@ianuragthakur) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేశారు. ఓపెనర్​ స్మృతి మంధాన (46 పరుగులు, 4x6, 1x6), జెమీమా రోడ్రిగ్స్ (42 పరుగులు, 5x4) రాణించారు. ఇక గత మ్యాచ్​ సంచలనం షఫాలీ వర్మ (9), వికెట్ కీపర్ రిచా గోష్ (9), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (2), పూజ వస్ర్తకార్ (2) నిరాశ పర్చారు. ఇక శ్రీలంక బౌలర్లలో ఇనోకా, సుగంధిక, ప్రభోదని తలో రెండు వికెట్లు తీసి సత్తా చాటారు.

అనంతరం 117 పరుగుల లక్ష్య ఛేనలో దిగిన లంక 14 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టీమ్ఇండియా 18 ఏళ్ల యంగ్ బౌలర్ టిటాస్ సాధు.. వరుసగా అనుష్క సంజీవని (1), విష్మి గుణరత్నే (0), కెప్టెన్ చమరి ఆటపట్టు (12)ను పెవిలియన్ చేర్చి లంకను దెబ్బకొట్టింది. తర్వాత హాసిని పెరీరా (25 పరుగులు, 4x4, 1x6), నీలాక్షి డి సిల్వా (23 పరుగులు) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. అయితే సరైన సమయానికి రాజేశ్వరి గైక్వాడ్ భారత్​కు బ్రేక్ ఇచ్చింది. ఆమె హాసిని పెరీరాను ఔట్​ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఓషది రణసింగ్ (19) కాసేపు పోరాడినా.. ఓటమి అంతరాయాన్ని తగ్గించారే తప్ప జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ 2, పూజా వస్త్రాకర్‌, దీప్తి శర్మ, దేవిక వైద్య తలో వికెట్ పడగొట్టారు.

ఈ విజయంతో భారత్​కు స్వర్ణ పతకం రాగా.. శ్రీలంక సిల్వర్​తో సరిపెట్టుకుంది. ఇక ఈ పోటీల్లో మూడో స్థానం కోసం బంగ్లాదేశ్-పాకిస్థాన్ మధ్య జరిగిన పోరులో బంగ్లా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

  • An outstanding victory for our Indian women's cricket team at the Asian Games final! Heartiest congratulations, champions!#AsianGames

    — Cheteshwar Pujara (@cheteshwar1) September 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Street Child Cricket World Cup 2023 : 17 దేశాలు.. 20 జట్లతో స్ట్రీట్​ చైల్డ్​ వరల్డ్​ కప్.. దీని ప్రత్యేకత​ ఏంటంటే ?​

Asian Games 2023 : భారత్‌కు తొలి స్వర్ణం.. వరల్డ్ రికార్డ్​

Last Updated : Sep 25, 2023, 6:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.