Asian Games 2023 Womens Cricket Final : భారత్‌లో క్రికెట్‌కు ఉండే క్రేజ్ వేరు. టీమ్ఇండియా ఏదైనా టోర్నమెంట్లో పాల్గొంటుందంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే రీసెంట్గా భారత్.. 2023 ఆసియా కప్ టోర్నీ ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును మట్టికరిపించి.. ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి.. ఇంకో 24 గంటల్లోపు ఓ ఫైనల్లో భారత్-శ్రీలంక మధ్య పోరు జరగనుంది.
సెప్టెంబర్ 25 సోమవారం ఫైనల్ పోరులో భారత్.. శ్రీలంకను ఢీకొట్టనుంది. అయితే ఇది పురుషుల జట్లు మధ్య కాదండోయ్.. ఈ పోరు ఇరుదేశాల మహిళల క్రికెట్ జట్ల మధ్య ఉండనుంది. చైనా వేదికగా జరుగుతున్న 2023 ఆసియా క్రీడల్లో తొలిసారి క్రికెట్‌ను ఈ గేమ్స్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లీగ్, సెమీఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన భారత మహిళల జట్టు.. ఫైనల్‌కు చేరింది. తద్వారా ఫైనల్స్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ఇక మరో సెమీస్‌లో శ్రీలంక- పాకిస్థాన్‌తో తలపడ్డాయి. ఇందులోలో శ్రీలంక 6 వికెట్లతో నెగ్గి.. ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. దీంతో తుది పోరులో భారత్-శ్రీలంక మహిళల జట్లు తలపడనున్నాయి.
ఫైనల్స్‌కు ఇలా.. ఈ ప్రతిష్ఠాత్మకమైన పోటీల్లో భారత్.. తొలి మ్యాచ్‌లో మలేసియా మహిళల జట్టుతో తలపడింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే భారత్‌కు మెరుగైన ర్యాంకింగ్ ఉండటం వల్ల సెమీస్‌కు అర్హత సాధించింది.
ఇక సెమీస్‌లో భారత మహిళల జట్టు.. బంగ్లాదేశ్ మహిళల జట్టును ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాను.. భారత బౌలర్లు ఓ ఆట ఆడేసుకున్నారు. 17.5 ఓవర్లలో 51 పరుగుల వద్ద ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేశారు. అనంతరం భారత్ రెండు వికెట్లు కోల్పోయి.. 8.2 ఓవర్లలో 52 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ కెప్టెన్ స్మృతి మంధాన (7) తడబడినా.. షెఫాలీ వర్మ (17), జెమీమా రోడ్రిగ్స్ (20*) జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఇక సోమవారం శ్రీలంకతో పోరులో గెలిస్తే.. టీమ్‌ఇండియా స్వర్ణ పతకాన్ని ముద్దాడనుంది.
-
What a win! 🙌
— BCCI Women (@BCCIWomen) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Pooja Vastrakar shines with a 4⃣- wicket haul as #TeamIndia chase down the target with more than 11 overs to spare 👌👌
India are through to the Final! 👏👏
Scorecard - https://t.co/G942Qn13JI#AsianGames | #IndiaAtAG22 pic.twitter.com/vetB8QgcFq
">What a win! 🙌
— BCCI Women (@BCCIWomen) September 24, 2023
Pooja Vastrakar shines with a 4⃣- wicket haul as #TeamIndia chase down the target with more than 11 overs to spare 👌👌
India are through to the Final! 👏👏
Scorecard - https://t.co/G942Qn13JI#AsianGames | #IndiaAtAG22 pic.twitter.com/vetB8QgcFqWhat a win! 🙌
— BCCI Women (@BCCIWomen) September 24, 2023
Pooja Vastrakar shines with a 4⃣- wicket haul as #TeamIndia chase down the target with more than 11 overs to spare 👌👌
India are through to the Final! 👏👏
Scorecard - https://t.co/G942Qn13JI#AsianGames | #IndiaAtAG22 pic.twitter.com/vetB8QgcFq
-
We're headed to the Finals of the Asian Games Women's Cricket Competition after a fantastic 6-wicket victory over Pakistan! 🎉🏆 #TeamSriLanka #AsianGames pic.twitter.com/xni47dEuvw
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">We're headed to the Finals of the Asian Games Women's Cricket Competition after a fantastic 6-wicket victory over Pakistan! 🎉🏆 #TeamSriLanka #AsianGames pic.twitter.com/xni47dEuvw
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 24, 2023We're headed to the Finals of the Asian Games Women's Cricket Competition after a fantastic 6-wicket victory over Pakistan! 🎉🏆 #TeamSriLanka #AsianGames pic.twitter.com/xni47dEuvw
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 24, 2023
Ind Vs Ban Asian Games 2023 : బంగ్లాను చిత్తు చేసిన స్మృతి సేన.. ఇక భారత్‌కు పతకం ఖాయం
Asian Games 2023 : 15 పరుగులకే ఆలౌట్.. మహిళా టీ20ల్లో చెత్త రికార్డు