ETV Bharat / sports

Asia Cup Controversies : వినోదంలోనే కాదు.. వివాదాల్లోనూ ఆసియా కప్​ టాపే.. ఈ కాంట్రవర్సీలు గుర్తున్నాయా? - ఆసియా కప్​ గంభీర్ కమ్రాన్ అక్మల్ కాంట్రవర్సీ

Asia Cup Controversies : ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ అభిమానులకు అద్భుతమైన క్రికెట్ మజాను అందించడమే కాకుండా.. పలు సందర్భాలూ వివాదాలూ చోటుచేసుకుని వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఎప్పుడంటే ?

Asia Cup Controversies
Asia Cup Controversies
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 1:28 PM IST

Asia Cup Controversies : ఆసియా కప్​ మొదలై మూడు రోజులే అయింది. కానీ క్రికెట్​ లవర్స్​కు ఈ టోర్నీ ఇచ్చే కిక్కు మాత్రం మామూలుగా ఉండదు. ఆడేది ఆరు దేశాలే.. కానీ వీక్షకులకు మాత్రం వినోదం ఫుల్‌. అయితే ఈ ఆసియా కప్​ వినోదంతో పాటు వివాదాలకూ లోటులేని టోర్నీగా చరిత్రకెక్కింది. ఇక భారత్, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ వంటి పటిష్ఠమైన జట్లు ఉంటే ఆ మాత్రం హడావుడి ఉండాల్సిందే. ఇక చిరకాల ప్రత్యర్థులైన భారత్‌, పాక్‌ మధ్య జరిగే మ్యాచ్‌ల్లోనూ వివాదాలు చోటుచేసుకున్నాయి. మరి ఇలాంటి 'మినీ టోర్నీ'లో ఇప్పటి వరకు జరిగిన కొన్ని వివాదాస్పద సంఘటనల గురించి తెలుసుకుందాం..

గంభీర్ - కమ్రాన్ అక్మల్..
Gautam Gambhir Kamran Akmal : భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ అంటేనే అటు ఆడియెన్స్​తో పాటు మైదానంలో దిగే ఆటగాళ్లలోనూ టెన్షన్‌ వాతావరణం నెలకొంటుంది. మ్యాచ్‌లు కాస్త రసవత్తరంగా మారే కొద్దీ ప్లేయర్స్​ మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడం కుడా కామనే. అయితే కొన్ని సార్లు అవి పెద్దదై కాంట్రవర్సీలుగా మారుతుంటాయి. సరిగ్గా అలాంటిదే 2010 ఆసియా కప్‌ సందర్భంగా జరిగింది.

పాక్‌ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్‌లో బంతి బ్యాట్‌ను తాకినట్లు గంభీర్‌ ఔట్ కోసం అప్పీలు చేశారు. అయితే, అంపైర్‌ బిల్లీ బౌడెన్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో పాకిస్థాన్‌ రివ్యూకి వెళ్లింది. ఈ సమయంలోనే గంభీర్‌, వికెట్ కీపర్‌ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అయితే అది కాస్త కాసేపటికే తీవ్రం కావడం వల్ల ఇరు జట్ల ప్లేయర్స్​ వారిని అడ్డుకొన్నారు. గంభీర్‌ను ధోనీ పక్కకు తీసుకెళ్లగా.. కమ్రాన్‌ అక్మల్‌ను పాక్‌ ఆటగాళ్లు సముదాయించారు. దీంతో గొడవ కాస్త సద్దుమణిగింది.

హర్భజన్ -అక్తర్..
Harbhajan Singh Shoaib Akhtar : ఆసియా కప్ 2010 టోర్నీలో జరిగిన గంభీర్ - కమ్రాన్ అక్మల్‌ వాగ్వాదం మరువకముందే.. ఇదే మ్యాచ్‌లో కాసేపటికే హర్భజన్‌ సింగ్‌ - షోయబ్ అక్తర్ గొడవపడ్డారు. దీనికి కారణం అక్తర్‌ బౌలింగ్‌లో హర్భజన్‌ భారీ సిక్సర్‌ కొట్టడం. ఆ తర్వాత అక్తర్‌ బౌన్సర్ విసిరాడు. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం ప్రారంభమైంది. ఇక చివరిగా హర్భజన్‌ సింగ్‌ మహమ్మద్ అమిర్ బౌలింగ్‌లో సిక్స్‌తో భారత్‌ను గెలిపించాడు. దీంతో అక్తర్‌ వైపు కాస్త కోపంగా చూశాడు.

ఇటీవల ఆ సంఘటనపై అక్తర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. "మ్యాచ్‌ అయిపోయాక హర్భజన్‌ సింగ్‌ ఉన్న రూమ్‌ను వెతుక్కుంటూ వెళ్లాను. అతడితో పోట్లాడదామనే అక్కడి వరకు వెళ్లాను. మాతో కలిసి తిన్నాడు. లాహోర్‌లో మాతోనే కలిసి తిరిగాడు. ఇలాంటి వ్యక్తి మనతో తప్పుగా ప్రవర్తిస్తాడా? అని ఒక్క క్షణం ఆలోచించాను. ఇక మరుసటి రోజు నేను శాంతించాను. అతడు కూడా సారీ చెప్పాడు" అని అక్తర్​ తెలిపాడు.

ఆ ఇద్దరి జోరు.. పాక్‌ - అఫ్గానిస్థాన్‌ పోరు..
Pakistan Vs Afganistan Asia Cup : భారత్ - పాకిస్థాన్‌ టీమ్స్​ మధ్య ఎలాంటి పరిస్థితి ఉంటుందో.. పాక్‌ - అఫ్గానిస్థాన్‌ మధ్య కూడా అదే రేంజ్​లో ఉద్విగ్న పరిస్థితులు ఉంటాయి. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ చివరి ఓవర్‌ సందర్భంగా జరిగిన వాగ్వాదాన్ని ఏ క్రికెట్​ లవర్​ కూడా మర్చిపోలేరు.

పాక్ యువ బౌలర్ నసీమ్ షా చివరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టి తన జట్టు గెలిపించాడు. ఈ సందర్భంగా జరిగిన సంబరాలు కాస్త శ్రుతి మించాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లూ కొట్టుకొనే స్థాయికి వెళ్లాయి. అంతకుముందు ఇదే మ్యాచ్‌లో పాక్‌ బ్యాటర్ అసిఫ్‌ అలీ, అఫ్గాన్‌ బౌలర్ ఫరీద్‌ అహ్మద్ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఒకానొక సందర్భంలో అసిఫ్ అలీ తన బ్యాట్‌ను ఎత్తి ఫరీద్‌ను కొట్టేందుకు కూడా ప్రయత్నించాడు. అయితే ఈ మ్యాచ్‌లో పాక్‌ ఒక్క వికెట్‌ తేడాతో విజయం సాధించింది.

షకిబ్‌ అత్యుత్సాహం
Pak Vs Bang Asia cup 2016 : బంగ్లాదేశ్‌ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ అత్యుత్సాహం ఆసియా కప్‌లోనూ కొనసాగింది. దీంతో అతడిని ఐసీసీ కూడా మందలిస్తూ పలు హెచ్చరికలు జారీ చేసింది. 2016 ఆసియా కప్‌లో భాగంగా జరిగిన బంగ్లాదేశ్​- పాకిస్థాన్‌ మ్యాచ్‌లో మహమ్మద్‌ అమిర్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ కావడం వల్ల షకిబ్‌ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. అయితే ఆ వెంటనే స్టంప్స్‌ను తన బ్యాట్‌తో కొట్టాడు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ .. మరోసారి ఇలాంటివి పునరావృతం చేయొద్దనంటూ హసన్​ను హెచ్చరించింది.

నెట్టింట వార్​..
Ind Vs Bang Asia Cup : 2016 ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ - బంగ్లాదేశ్‌ జట్లు తలపడ్డాయి. ఇందులో టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది. అయితే, బంగ్లా అభిమానులు కొందరు అత్యుత్సాహంతో సోషల్‌ మీడియా వేదికగా అప్పటి భారత కెప్టెన్ ఎంఎస్ ధోనీని అవమానించేలా ఫొటోలను రూపొందించారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. దీంతో ఈ విషయంపై స్పందించిన భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి కాస్త కటువుగానే జవాబిచ్చాడు. " మా ఆటగాళ్లు ఎవరూ పేపర్లు చదవరు. సోషల్ మీడియాను ఫాలో కారు. తొలి ప్రాధాన్యం మాత్రం జట్టు తరఫున ఆడటం మాత్రమే" అంటూ సోషల్ మీడియా వార్తలను కొట్టిపడేశాడు.

అర్ష్‌దీప్‌పై ట్రోల్స్​..
Asia Cup 2022 Arshdeep Trolls : 2022 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఓ క్యాచ్‌ను విడిచిపెట్టాడు. కీలకమైన సమయంలో అసిఫ్‌ అలీ క్యాచ్‌ను డ్రాప్‌ చేయడం వల్ల ఆ మ్యాచ్‌ను భారత్‌ కోల్పోయింది. దీంతో కొందరు నెట్టింట అర్షదీప్​ను 'ఖలిస్థానీ' అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలూ రేగాయి.

India Vs Pakistan Asia Cup : మినీ టోర్నీలో భారత్​ X పాకిస్థాన్​.. ఈ ఇంట్రెస్టింగ్​ విషయాలు తెలుసా?

Key Players In Asia Cup 2023 : మినీ టోర్నమెంట్​లో అందరి చూపు వీరివైపే.. అంచనాలను అందుకునేదెవరో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.