Asia Cup 2023 Venue : ఆసియా కప్‌లో వరుణుడు కరుణించేలా కనిపించడం లేడు. ఇప్పటికే పల్లెకెలె వేదికగా పాకిస్థాన్ మ్యాచ్‌తో అసలైన మజాను ఆస్వాదిద్దామనుకున్న క్రికెట్ ఫ్యాన్స్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. ఫలితంగా మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా సూపర్ ఫోర్ మ్యాచెస్‌ను నిర్వహించడం ఓ సవాల్‌గా మారింది. దీంతో ఆసియా కప్ నిర్వాహకులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Asia Cup 2023 Rain : మ్యాచ్ వేదికలను మార్చాలని డిసైడ్ అయినట్లు సమాచారం అందింది. ఎందుకంటే ఇక ముందు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందట. ముఖ్యంగా శ్రీలంక రాజధాని కొలంబో, పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అంటే సూపర్ 4 మ్యాచ్‌ల నాటికి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పింది.
దీంతో ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్.. ముందు జాగ్రత్త చర్యలను తీసుకునేందుకు సిద్ధమైంది. కొలంబో వేదికగా జరిగే సూపర్ 4, ఫైనల్ మ్యాచ్‌లన్నింటినీ మార్చాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ సూపర్ 4 మ్యాచ్‌లను పల్లెకెలె, దంబుల్లా, హంబన్‌తోటా స్టేడియాలకు షిఫ్ట్ చేసేందుకు పరీశిలిస్తుందట.
ఈ నెల సెప్టెంబర్ 9, 10, 12, 14, 15 తేదీల్లో సూపర్ 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. అవన్నీ కొలంబోలోనే షెడ్యూల్ అయ్యాయి. 17న జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే జరుగనుంది. అందుకే.. ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో సూపర్ 4 మ్యాచులు సహా ఫైనల్‌ను పల్లెకెలె లేదా దంబుల్లాలకు తరలించవచ్చు.
Pak Sri Lanka Asia Cup : కాగా, ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతోంది. పాకిస్థాన్-శ్రీలకం వేదకగా నిర్వహిస్తు్ననారు. టోర్నీ ప్రారంభోత్సవం పాక్‌లోనే అయింది. ఇక సూపర్ 4 మ్యాచ్‌లు వచ్చే వారం శ్రీలంక కొలంబోలో జరగనున్నాయి. ఆసియాకప్‌నకు ఆతిథ్యమిచ్చే పాకిస్థాన్ కూడా శ్రీలంకలోనే మ్యాచులు ఆడనుంది. భారత జట్టు పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించడంతోనే.. టోర్నీని శ్రీలంకతో కలిసి హైబ్రీడ్ మోడ్‌లో పాకిస్థాన్ నిర్వహిస్తోంది.
-
A dampener on the match but not on the friendship 🤝#AsiaCup2023 pic.twitter.com/EZK5OTY6eU
— ICC (@ICC) September 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A dampener on the match but not on the friendship 🤝#AsiaCup2023 pic.twitter.com/EZK5OTY6eU
— ICC (@ICC) September 3, 2023A dampener on the match but not on the friendship 🤝#AsiaCup2023 pic.twitter.com/EZK5OTY6eU
— ICC (@ICC) September 3, 2023
Ind vs Pak Asia Cup 2023 : డోంట్ వర్రీ ఫ్యాన్స్.. టోర్నీలో మరో ఇండో-పాక్ మ్యాచ్.. డేట్ ఫిక్స్!