ETV Bharat / sports

Asia Cup 2023 Super 4 IND VS PAK : వరుణా వదిలేటట్టు లేవుగా.. పాకిస్థాన్‌తో సూపర్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 6:52 PM IST

Updated : Sep 9, 2023, 10:00 PM IST

Asia Cup 2023 Super 4 IND VS PAK Rain Update : ఆసియా కప్‌లో భారత్ పాకిస్థాన్​ సూపర్‌-4 మ్యాచ్​కు వర్షం ముప్పు ఉందని తెలిసింది. ఆ వివరాలు..

Asia Cup 2023 Super 4 IND VS PAK : వరుణా వదలేటట్టు లేవుగా..  పాకిస్థాన్‌తో సూపర్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు!

Asia Cup 2023 Super 4 IND VS PAK Rain Update : ఆసియా కప్‌ 2023 గ్రూప్‌ దశలో చిరకాల ప్రత్యర్థులు టీమ్​ఇండియా-పాక్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. టీమ్​ఇండియా ఇన్నింగ్స్‌ ముగిసిన సమయానికి జోరుగా వర్షం కురవడంతో... చివరికి చేసేదేమి లేక పాక్‌ జట్టు బ్యాటింగ్‌కు దిగకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అనౌన్స్​ చేశారు. దీంతో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ మ్యాచ్‌ను చూద్దామనుకున్న ప్రపంచ క్రికెట్​ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. అందరూ డీలా పడిపోయారు.

Asia Cup 2023 Rain Update : అయితే సూపర్‌-4లో ఈ రెండు జట్లు మరో సారి పోటీపడనుండటం వల్ల ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అలానే మ్యాచ్‌పై తీవ్ర ఆసక్తి నెలకొంది. కానీ, ఇప్పుడీ మ్యాచ్‌కూ వరుణుడి ముప్పు పొంచి ఉందని తెలిసింది. మ్యాచ్‌ జరిగే సెప్టెంబరు 10న కొలంబోలో 90 శాతం వర్షం కురిసే అవకాశముందని అంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళలో వర్షం కురిసే అవకాశాలు ఎక్కువగా ఉందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు నేషనల్​ మీడియాలో వస్తున్నాయి. రిజర్వ్‌ డే అయిన మరుసటి రోజు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. దీంతో ఇరుజట్ల అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ మ్యాచ్‌కైనా వరుణుడు కరుణించాలని కోరుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Asia Cup 2023 Super 4 IND VS PAK : అయితే సూపర్ ఫోర్ మ్యాచెస్​లో ఇప్పటికే ఒక మ్యాచ్‌ గెలిచి ఊపు మీదుంది పాకిస్థాన్​. ఇప్పుడు టీమ్​ఇండియాతో హైటెన్షన్‌ సమరానికి సిద్ధమవుతోంది. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌ దిశగా బలంగా అడుగేయాలని టీమ్​ఇండియా గట్టి పట్టుదలగా ఉంది. కానీ పాక్ బౌలింగ్ చాలా బలంగా ఉంది. దీన్ని ఎదుర్కోవడం భారత బ్యాటింగ్‌కు గట్టి సవాల్‌ లాంటిదనే చెప్పాలి. పేపర్‌పై భారత్‌ కన్నా పాకిస్థానే బలంగా ఉందని మాజీలు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని టీమ్​ఇండియా పక్కా ప్రణాళిక రచిస్తోంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కూడా ఉంది.

India Pakistan Series : 'భారత్​-పాక్​ సిరీస్​ కోసం PCB డిమాండ్​.. అంతా సర్కార్​ చేతుల్లోనే!'

Afg Vs SL Asia Cup 2023 : శ్రీలంకకు సూపర్‌-4 బెర్త్‌ ఖరారు.. అఫ్గాన్​కు నిరాశే..

Last Updated : Sep 9, 2023, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.