Asia Cup 2023 Stats : 2023 ఆసియా కప్‌లో టీమ్ఇండియా ప్లేయర్లదే హవా నడుస్తోంది. టోర్నీలో ఓటమి అనేదే ఎరుగకుండా అద్భుతమైన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ దూసుకుపోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, యువ సంచలనం శుభ్‌మన్ గిల్, జట్టులో రీ ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ బ్యాటింగ్ విభాగాన్ని తమ భుజాలపై మోస్తున్నారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. ఈ టోర్నమెంట్లో నిలకడగా రాణిస్తున్నాడు.
పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ త్వరగా ఔటైనప్పటికీ.. తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లో(నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక) వరుసగా 74, 56, 53 స్కోర్లు నమోదు చేశాడు. మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో 64.67 సగటున 108.99 స్ట్రైక్ రేట్‌తో 194 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
టాప్ 5లో ఉన్న బ్యాటర్లు..
- నజ్ముల్ హోసన్ శాంటో (బంగ్లాదేశ్) 193 పరుగులు
- బాబార్ అజామ్ (పాకిస్థాన్) 178 పరుగులు
- సదీర సమరవిక్రమ (శ్రీలంక) 167 పరుగులు
- కుశాల్ మెండీస్ (శ్రీలంక) 162 పరుగులు
-
The Hitman has raced to the top in a flash! ⚡️#AsiaCup2023 pic.twitter.com/uE2M4dAK4R
— AsianCricketCouncil (@ACCMedia1) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The Hitman has raced to the top in a flash! ⚡️#AsiaCup2023 pic.twitter.com/uE2M4dAK4R
— AsianCricketCouncil (@ACCMedia1) September 13, 2023The Hitman has raced to the top in a flash! ⚡️#AsiaCup2023 pic.twitter.com/uE2M4dAK4R
— AsianCricketCouncil (@ACCMedia1) September 13, 2023
-
రోహిత్ @10000.. శ్రీలంతో మ్యాచ్‌లో రోహిత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ క్రమంలోనే అతడు వన్డేల్లో 10వేల మార్క్ అందుకున్నాడు. దీంతో వన్డేల్లో ఈ ఫీట్ సాధించిన ఆరో భారత బ్యాటర్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు.
ఇక బౌలింగ్ విషయానికొస్తే.. గత మూడు మ్యాచ్‌ల్లోనూ భారత్.. ప్రత్యర్థుల్ని ఆలౌట్ చేసి అదరగొట్టింది. చాలా కాలం తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. కట్టుదిడ్డంగా బంతులు సంధిస్తున్నాడు. ఇక స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తమ ఫామ్‌ను చాటుకుంటున్నారు. 9 వికెట్లతో టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్.. అత్యధిక వికెట్లు తీసిన లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు.
టాప్ 5లో ఉన్న బౌలర్లు
- వెల్లలాగె (శ్రీలంక) 9 వికెట్లు
- హరీస్ రౌఫ్ (పాకిస్థాన్) 9 వికెట్లు
- తస్కిన్ అహ్మద్ (బంగ్లాదేశ్) 9 వికెట్లు
- షహీన్ అఫ్రిదీ (పాకిస్థాన్) 8 వికెట్లు
రెండు రోజుల్లో 0-9.. టోర్నమెంట్ లీగ్ దశలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో కుల్దీప్.. 10 ఓవర్లు బౌలింగ్ చేసినప్పటికీ వికెట్ తీయలేకపోయాడు. కానీ సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లతో సత్తా చాటాడు. ఇక మంగళవారం శ్రీలంకతో మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి టీమ్ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో లీగ్ మ్యాచ్‌ల్లో వికెట్లు తీయకపోయినప్పటికీ.. వరుస మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్ చేసి రెండు రోజుల్లోనే టాప్‌లోకి దూసుకొచ్చాడు కుల్దీప్.
-
9 wickets in 2 days! Kuldeep Yadav has spun his way to the top! ✅#AsiaCup2023 pic.twitter.com/l1J003gvbh
— AsianCricketCouncil (@ACCMedia1) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">9 wickets in 2 days! Kuldeep Yadav has spun his way to the top! ✅#AsiaCup2023 pic.twitter.com/l1J003gvbh
— AsianCricketCouncil (@ACCMedia1) September 13, 20239 wickets in 2 days! Kuldeep Yadav has spun his way to the top! ✅#AsiaCup2023 pic.twitter.com/l1J003gvbh
— AsianCricketCouncil (@ACCMedia1) September 13, 2023
Ravindra Jadeja Asia Cup Wickets : ఇర్ఫాన్‌ను వెనక్కినెట్టిన జడేజా.. ఆసియా కప్‌లో అరుదైన ఫీట్
KL Rahul Asia Cup 2023 : వాట్ ఏ కమ్ బ్యాక్ రాహుల్... ఆ ఒక్క పనితో ధోనీని గుర్తుచేశావుగా!