Asia Cup 2023 Sl vs Ban : 2023 ఆసియా కప్ సూపర్-4లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 9 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అనంతరం 258 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా.. 48.1 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లలో మహీషా పతిరన , శనాక , తీక్షణ మూడేసి వికెట్లు పడగొట్టి బంగ్లా పతనాన్ని శాసించారు. అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సమరవిక్రమ (93 పరుగులు; 72 బంతుల్లో 8x4, 2x6) కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది. ఇక సూపర్ 4లో పాకిస్థాన్‌తో తొలిమ్యాచ్‌లో భంగపడ్డ బంగ్లా.. ఈ ఓటమితో బంగ్లా దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే.
-
Sri Lanka beat Bangladesh by 21 runs!
— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Samarawickrama led the charge with a scintillating 93 in the first innings, while the Lankan bowlers exhibited exceptional skills in restricting Bangladesh. 🇱🇰 #AsiaCup2023 #SLvBAN pic.twitter.com/5R8elHEXW0
">Sri Lanka beat Bangladesh by 21 runs!
— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2023
Samarawickrama led the charge with a scintillating 93 in the first innings, while the Lankan bowlers exhibited exceptional skills in restricting Bangladesh. 🇱🇰 #AsiaCup2023 #SLvBAN pic.twitter.com/5R8elHEXW0Sri Lanka beat Bangladesh by 21 runs!
— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2023
Samarawickrama led the charge with a scintillating 93 in the first innings, while the Lankan bowlers exhibited exceptional skills in restricting Bangladesh. 🇱🇰 #AsiaCup2023 #SLvBAN pic.twitter.com/5R8elHEXW0
ఛేదనలో బంగ్లా తడబాటు.. టార్గెట్ పెద్దదేమీ కాదు. ఛేదనను బంగ్లా అద్భుతంగా ఆరంభించింది. 11 ఓవర్లకు బంగ్లా 55/0తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాతే మొదలైంది బంగ్లాదేశ్ పతనం. లంక బౌలర్ శనాక తన వరుస ఓవర్లలో.. ఓపెనర్లు మెహిదీ హసన్ మిరాజ్ (28), మహమ్మద్ నయిమ్ (21)ను పెవిలియన్ చేర్చి బంగ్లాకు షాక్ ఇచ్చాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ షకీబ్ అల్ హసన్ (3) వెనుదిరిగాడు. ఇక బంగ్లా 18.5 ఓవర్లకు 83/4 తో కష్టాల్లో పడింది.ఆ తర్వాత హృదాయ్ (82 పరుగులు; 97 బంతుల్లో 7x4, 1x6) హాఫ్ సెంచరీతో రాణించి.. బంగ్లా శిబిరంలో ఆశలు రేపాడు. కానీ అతడికి సహకారం అందించేవారు కరవయ్యారు. చివర్లో టపాటపా వికెట్లు పారేసుకున్న బంగ్లా.. 236 పరుగులకు ఆలౌటైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కరునరత్నె (18) త్వరగానే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ నిశాంక (40 పరుగులు ; 60 బంతుల్లో 5x4), వన్ డౌన్లో వచ్చిన కుశాల్ మెండీస్ (50 పరుగులు; 73 బంతుల్లో 6x4, 1x6)తో కలిసి (74 పరుగుల) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. నిశాంక ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సమరవిక్రమ.. చక్కని షాట్లతో అలరించాడు.
బంగ్లా బౌలర్లను అతడు సమర్థంగా ఎదుర్కొని.. స్కోరు బోర్డును బోర్డును నడిపించాడు. చివర్లో లయ తప్పిన లంక బ్యాటర్లు.. స్పల్ప వ్యవధిలో వికెట్లు పారేసుకున్నారు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సమరవిక్రమ క్యాచ్ ఔటయ్యాడు. బంగ్లా బ్యాటర్లలో తస్కిన్, హసన్ మహమూద్ చెరో మూడు.. ఇస్లామ్ రెండు వికెట్లు తీశారు.
-
A closely contested affair matched with a lineup of top-notch performers! 🫶#AsiaCup2023 #SLvBAN pic.twitter.com/xWcOzt1CkF
— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A closely contested affair matched with a lineup of top-notch performers! 🫶#AsiaCup2023 #SLvBAN pic.twitter.com/xWcOzt1CkF
— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2023A closely contested affair matched with a lineup of top-notch performers! 🫶#AsiaCup2023 #SLvBAN pic.twitter.com/xWcOzt1CkF
— AsianCricketCouncil (@ACCMedia1) September 9, 2023
SL Vs Ban Asia Cup : ఆ రికార్డుపై లంక జట్టు గురి.. మరి బంగ్లా ఏం చేయనుందో ?