Asia Cup 2023 Shreyas Iyer : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. 2023 ఆసియా కప్ టోర్నమెంట్‌తో జట్టులోకి రీ ఎంట్రీ (Shreyas Iyer Comeback) ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు.. పూర్తి ఫిట్నెస్ సాధించి, గ్రౌండ్లో సాధన చేస్తున్నాడు. అయితే అయ్యర్ గాయంతో బాధపడుతున్న సమయంలో.. తన మానసిక పరిస్థితి, బెంగళూరులోని ఎన్సీఏ క్యాంపులో రికవరీ, అతడ్ని సపోర్ట్ చేసిన వారి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇంతకీ అయ్యర్ ఏమన్నాడంటే..
-
A journey of excruciating pain, patience and recovery 👏👏@ShreyasIyer15 highlights the contributions of trainer Rajini and Nitin Patel at the NCA in his inspirational comeback from injury 👌👌 - By @RajalArora #TeamIndia | @VVSLaxman281
— BCCI (@BCCI) August 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Full interview 🎥🔽
">A journey of excruciating pain, patience and recovery 👏👏@ShreyasIyer15 highlights the contributions of trainer Rajini and Nitin Patel at the NCA in his inspirational comeback from injury 👌👌 - By @RajalArora #TeamIndia | @VVSLaxman281
— BCCI (@BCCI) August 27, 2023
Full interview 🎥🔽A journey of excruciating pain, patience and recovery 👏👏@ShreyasIyer15 highlights the contributions of trainer Rajini and Nitin Patel at the NCA in his inspirational comeback from injury 👌👌 - By @RajalArora #TeamIndia | @VVSLaxman281
— BCCI (@BCCI) August 27, 2023
Full interview 🎥🔽
తాను గాయం కారణంగా చాలా ఇబ్బంది పడ్డాడని.. తన కాలు చిన్న వేలుకి తగిలిన గాయం విపరీతమైన నొప్పిని కలిగించిందని అయ్యర్ గుర్తుచేసుకున్నాడు. " గాయం తర్వాత నేరుగా ఇంటికి వెళ్లి, పది రోజులు విశ్రాంతి తీసుకున్నాను. ఓ రోజు డాక్టర్ వచ్చి పరిస్థితిని చూసి.. సర్జరీ అవసరమని చెప్పారు. దీంతో నేను సర్జరీ చేయించుకునేందుకు డిసైడయ్యా. ఇక సర్జరీ తర్వాత నేను లండన్‌లో మూడు వారాలు ఉన్నాను. ఈ తర్వాత బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకున్నాను. నాకు ఇదంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపించింది. కానీ సర్జరీ తర్వాత మూడు నెలలు తీవ్రమైన నొప్పితో బాధపడ్డాను. ఈ కఠిన సమయంలో నా కుటుంబ సభ్యులతో సహా.. ఎన్సీఏలో సిబ్బంది నాకు మద్దతుగా నిలబడ్డారు. ఫిట్నెస్ టెస్ట్ కోసం రన్నింగ్ సెషన్లు ప్రారంభించాను. ఓ ట్రయల్స్ మ్యాచ్ కూడా ఆడాను. దీంతో యో యో టెస్ట్ క్లియర్ చేశా. ఇక గతం గురించి, భవిష్యత్ గురించి ఆలోచించను. ఇప్పుడేం చేయాలనేదానిపైనే దృష్టి సారిస్తా. ఇంత త్వరగా గాయం నుంచి కోలుకుంటానని అనుకోలేదు. జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వడం నిజంగా ఆనందంగా ఉంది "అని అయ్యర్ అన్నాడు.
మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. గాయం నుంచి కోలుకొని ఐర్లాండ్ పర్యటనలో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇక వన్డేల్లో కూడా రాణిస్తే.. మహమ్మద్ సిరాజ్, బుమ్రా ద్వయంతో భారత పేస్ దళం బలంగా మారుతుంది. ఇక కేఎల్ రాహుల్ (KL Rahul Comeback), అయ్యర్ రాకతో మిడిలార్డర్ కూడా బలపడుతుంది.
IPL 2023: శ్రేయస్ విషయంలో అనుకున్నదే జరిగిందిగా
Shreyas Iyer Comeback : నేనిలా ఉండడానికి వారే కారణం : శ్రేయస్ అయ్యర్