Asia Cup 2023 Rain Update India VS Nepal : ఆసియా కప్‌ను వరుణుడు వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే టీమ్ ఇండియా మ్యాచ్ ఒకటి వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మ్యాచ్‌పై వర్షం ప్రభావం పడుతోంది. ఈ మ్యాచ్ పూర్తిగా జరుగుతుందా లేదా అనేది ప్రస్తుతం ఆందోళనగా మారింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 4 పరిస్థితి ఏంటి? అనే చర్చ తెగ సాగుతోంది. నేపాల్ మ్యాచ్ కూడా ఇప్పుడు వర్షం కారణంగా రద్దైపోతే ఎవరు సూపర్-4లోకి ఎంట్రీ ఇస్తారు? తెలుసుకుందాం..
Asia Cup 2023 Super 4 Matches : చిరకాల ప్రత్యర్థులు టీమ్‌ఇండియా - పాకిస్థాన్ (IND vs PAK) మధ్య శనివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే అప్పటికే నేపాల్‌పై సూపర్ విక్టరీ సాధించిన పాకిస్థాన్.. సూపర్ 4లోకి అడుగుపెట్టింది. మరోవైపు సోమవారం(సెప్టెంబర్ 4) అదే పల్లెకెలె వేదికగా నేపాల్‌తో టీమ్‌ఇండియా (India vs Nepal) మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌పై కూడా వరుణుడి ప్రభావం పడుతోంది. ఇప్పటికే మైదానం ఓ వైపు అంతా మేఘావృతం అయింది. వర్షపు జల్లులు కూడా పడ్డాయి. పిచ్‌పై కవర్లు కప్పి తీశారు.
INDIA VS NEPAL : అయితే ఈ నేపాల్‌తో జరిగే మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైతే.. ఇరుజట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. అప్పుడు టీమ్‌ఇండియా 2 పాయింట్లతో నేపాల్ కన్నా ముందుంటుంది. దీంతో భారతే సూపర్ 4లోకి ఎంట్రీ ఇస్తుంది. అంటే గ్రూప్ ఏ నుంచి టీమ్‌ఇండియా-పాకిస్థాన్ సూపర్ 4కు చేరుకున్న జట్లుగా నిలుస్తాయి. ఒకవేళ నేపాల్ సూపర్ 4కు వెళ్లాలని ఆశిస్తే.. టీమ్ఇండియాపై తప్పనిసరిగా విజయాన్ని అందుకోవాలి. అదే సమయంలో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కూడా ఉండకూడదు.
దీంతో మ్యాచ్ సజావుగా సాగాలని నేపాల్ క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. కానీ పసికూన నేపాల్‌పై టీమ్‌ఇండియా గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి నేపాల్ ఓడితే.. ఇంటిబాట పట్టాల్సిందే. చూడాలి మరి ఈ మ్యాచ్ వరుణుడు సొంతమవుతుందో? లేదా ఎవరు గెలిచి సూపర్ 4కు ఎంట్రీ ఇస్తారో?
-
The first ever ODI between Nepal and Pakistan is set to be a memorable clash, especially for the Nepalese cricket team. A proud moment for them to make their Asia Cup debut against one of the most prominent teams in world cricket. 👏#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/BXXX16EYxP
— AsianCricketCouncil (@ACCMedia1) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">The first ever ODI between Nepal and Pakistan is set to be a memorable clash, especially for the Nepalese cricket team. A proud moment for them to make their Asia Cup debut against one of the most prominent teams in world cricket. 👏#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/BXXX16EYxP
— AsianCricketCouncil (@ACCMedia1) September 4, 2023The first ever ODI between Nepal and Pakistan is set to be a memorable clash, especially for the Nepalese cricket team. A proud moment for them to make their Asia Cup debut against one of the most prominent teams in world cricket. 👏#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/BXXX16EYxP
— AsianCricketCouncil (@ACCMedia1) September 4, 2023
Asia Cup 2023 : నేపాల్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుది జట్లు ఇవే
Jasprit Bumrah Baby : తండ్రిగా బుమ్రాకు ప్రమోషన్.. పేరేంటో తెలుసా?