Asiacup 2023 IND VS Nepal : ఆసియా కప్ 2023లో భాగంగా నేడు(సెప్టెంబర్ 4) జరుగుతున్న మ్యాచ్‌లో నేపాల్ ఇన్నింగ్స్ ముగిసింది. ఊహించిన దాని కన్నా మంచి స్కోరే సాధించింది. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 48.2 ఓవర్లలో ఆలౌట్ అయింది. 230 పరుగులు చేసింది. ఓపెనర్లు కుశాల్(38; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆసిఫ్(58; 97 బంతుల్లో 8 ఫోర్లు) రాణించగా.. చివర్లో వచ్చిన సోంపల్ కామి(48; 56 బంతుల్లో) స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. గుల్షాన్ జా(23), దిపేంద్ర సింగ్(29) పర్వాలేదనిపించే స్కోరు చేశారు. 146 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన నేపాల్.. 180లోపే ఆలౌట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, సోమ్‌పాల్ పట్టుదలగా ఆడి స్కోర్ బోర్డును పెరిగేలా చేశాడు. భారత బౌలర్లలో సిరాజ్, జడేజా చెరో మూడు వికెట్లు తీయగా.. షమి, హార్దిక్ పాండ్య, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌కు ఓపెనర్లు కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ అదిరే ఆరంభాన్ని అందించారు. టీమ్ ఇండియా ఫీల్డర్లు చేసిన తప్పిదాలతో రాణించిన ఈ జోడీ మొదటి వికెట్‌కు 65 పరుగులు చేశారు. మొదటి ఆరు ఓవర్లలోనే భారత ప్లేయర్లు మూడు విలువైన సునాయస క్యాచ్‌లను నేలపాలు చేశారు. వరల్డ్ బెస్ట్ ఫీల్డర్స్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్ కిషన్ ఈ క్యాచ్‌లను అందుకోలేకపోయారు.
ఇక 65 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ జోడీని.. శార్దూల్ ఠాకూర్ విడదీసాడు. అర్ధ శతకం దిశగా ముందుకెళ్లిన కుశాల్ భుర్టెల్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత జడ్డూ తన స్పిన్‌తో భీమ్ షక్రీ(7), కెప్టెన్ రోహిత్ పౌడెల్(5), కుశాల్ మల్లాను(2) వరుసగా ఔట్ చేశాడు. అయితే ఓ వైపు వికెట్లు కోల్పోతున్నా.. మరోవైపు ఆసిఫ్ షేక్ మాత్రం అర్ధశతకంతో మెరిశాడు.
అతడి జోరును సిరాజ్ అడ్డుకట్ట వేశాడు. కోహ్లీ సింగిల్ హ్యాండ్‌తో సూపర్ క్యాచ్ పట్టాడు. మరుసటి ఓవర్‌లోనే గుల్జాన్ జాను(23) కూడా సిరాజ్ పెవిలియన్ పంపాడు. ఆ తర్వాత 50 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన దీపేంద్ర సింగ్, సోంపాల్ కమి జోడీని హార్దిక్ పాండ్య విడదీసాడు. దీపేంద్ర సింగ్‌ను(29) ఎల్బీగా ఔట్ చేశాడు. ఆ తర్వాత అర్ధ శతకానికి దగ్గరైన సోంపల్ కమీని(48) షమీ ఔట్ చేశాడు. సందీప్ లామిచ్చెనే(9) రనౌట్ అయ్యాడు. లలిత్ రాజ్‌బన్షిని(0) క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. నేపాల్ ఇన్నింగ్స్‌ను క్లోజ్ చేశాడు.
-
A solid opening partnership and some late striking by Sompal Kami has propelled Nepal to a total of 230!
— AsianCricketCouncil (@ACCMedia1) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Will the Indian batters chase this down with ease, or can Nepal successfully defend the total and create history? 💪#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/rsr6vIre8R
">A solid opening partnership and some late striking by Sompal Kami has propelled Nepal to a total of 230!
— AsianCricketCouncil (@ACCMedia1) September 4, 2023
Will the Indian batters chase this down with ease, or can Nepal successfully defend the total and create history? 💪#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/rsr6vIre8RA solid opening partnership and some late striking by Sompal Kami has propelled Nepal to a total of 230!
— AsianCricketCouncil (@ACCMedia1) September 4, 2023
Will the Indian batters chase this down with ease, or can Nepal successfully defend the total and create history? 💪#AsiaCup2023 #INDvNEP pic.twitter.com/rsr6vIre8R
Asia Cup 2023 : నేపాల్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన భారత్.. తుది జట్లు ఇవే
Jasprit Bumrah Baby : తండ్రిగా బుమ్రాకు ప్రమోషన్.. పేరేంటో తెలుసా?