Asia cup 2023 IND VS SL Kohli Rohith : ఆసియా కప్ సూపర్ -4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ప్రపంచ రికార్డును సాధించారు. వన్డేల్లో అత్యంత వేగంగా 5వేల పరుగులను జోడించిన బ్యాటర్లుగా నిలిచారు.
అంతకుముందు వెస్టిండీస్ దిగ్గజ ద్వయం గార్డన్ గ్రీనిడ్జ్ - డెస్మాండ్ హేన్స్ పేరిట ఈ రికార్డు ఉండేది. వారిద్దరూ 97 ఇన్నింగ్స్‌ల్లో ఈ మార్క్‌ను అందుకున్నారు. ఇప్పుడు కోహ్లీ- రోహిత్ శర్మ కేవలం 86 ఇన్నింగ్స్‌ల్లోనే 5 వేల పరుగుల భాగస్వామ్యం నిర్మించడం విశేషం. ఇందులో 18 సార్లు శతక భాగస్వామ్యం, 15 సార్లు అర్ధ శతకాల పార్టనర్‌షిప్ ఉంది. దాదాపు 62.47 యావరేజ్‌తో పరుగులు చేశారు. అత్యధికంగా 2018లో ఆస్ట్రేలియాపై 246 పరుగుల భాగస్వామ్యం జోడించారు. అయితే, ఇప్పుడు శ్రీలంకపై కేవలం 10 పరుగులు మాత్రమే నమోదు చేశారు. కోహ్లీ కేవలం 3 పరుగులకే ఔట్ అవ్వగా.. రోహిత్ శర్మ (53) హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. ఇంకా ఆసియా కప్‌లోనూ ఐదు వందల పరుగుల భాగస్వామ్యం కూడా దాటేశారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. పాకిస్థాన్‌పై ఆడినంత ఊపులో ఈ మ్యాచ్‌ను కొనసాగించలేకపోయింది. లంక బౌలర్ల చేతిలో చతికిలపడింది. దునిత్ వెల్లలాగే (5/40) వికెట్లు, చారిత్ అసలంక (4/14) టీమ్ఇండియాను బ్యాటర్లను బెంబేలెత్తించారు. ఓపెనర్ రోహిత్ శర్(53) ఒక్కడే కాస్త దూకుడుగా ఆడాడు. చివర్లో అక్సర్ పటేల్(26) స్కోర్ బోర్డును 200ప్లస్‌కు తీసుకెళ్లాడు. దీంతో భారత్.. లంక ముందు 214 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
తుదిజట్లు
టీమ్ఇండియా.. రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్
శ్రీలంక.. పాథున్ నిస్సాంక, దిముత్ కరుణరత్నె, కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక, డాసున్ శనక, ధనంజయ డిసిల్వా, మతీశా పతిరన, మహీశ్ తీక్షణ, కసున్ రజిత
-
It’s time for one of the most celebrated Asian rivalries of all time! The hosts have won more Asia Cup encounters, than they have lost against their neighbors. Which direction will the tides turn this time? 😍#AsiaCup2023 #INDvsSL pic.twitter.com/6ZDHefTc7e
— AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">It’s time for one of the most celebrated Asian rivalries of all time! The hosts have won more Asia Cup encounters, than they have lost against their neighbors. Which direction will the tides turn this time? 😍#AsiaCup2023 #INDvsSL pic.twitter.com/6ZDHefTc7e
— AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023It’s time for one of the most celebrated Asian rivalries of all time! The hosts have won more Asia Cup encounters, than they have lost against their neighbors. Which direction will the tides turn this time? 😍#AsiaCup2023 #INDvsSL pic.twitter.com/6ZDHefTc7e
— AsianCricketCouncil (@ACCMedia1) September 12, 2023
Asia Cup 2023 IND VS SL : లంక స్పిన్ దెబ్బకు టీమ్ఇండియా విలవిల .. లక్ష్యం ఎంతంటే?