Asia Cup 2023 Ind vs Pak Reserve Day : ఆసియాకప్ 2023 టీమ్ఇండియా-పాకిస్థాన్ సూపర్ 4 మ్యాచ్ రిజర్వ్ డేకి వెళ్లింది. వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకపోవడం వల్ల.. సోమవారం మ్యాచ్‌ను కొనసాగించనున్నట్లు అంపైర్లు అనౌన్స్ చేశారు. నేడు మ్యాచ్ నిలిచిపోయిన సమయానికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (56), శుబ్‌మన్ గిల్ (58) పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ (8*), కేఎల్ రాహుల్ (17*) క్రీజులో కొనసాగుతున్నారు. రేపు మ్యాచ్ 24.1 ఓవర్ నుంచి కొనసాగనుంది. భారత్ ఇన్నింగ్స్ కొనసాగించనుంది.
Asia Cup 2023 Ind vs Pak Rain Update : మరోసారి వర్షం.. 24.1 ఓవర్ల ఆట పూర్తైన తర్వాత భారీ వర్షం కురిసింది. దీంతో ఆటను నిలిపివేసి మైదానాన్ని కవర్లతో కప్పేశారు. చాలాసేపటి తర్వాత వర్షం కురవడం ఆగింది. అప్పుడు మ్యాచ్‌ను నిర్వహించేందుకు ప్రయత్నించారు. మైదాన సిబ్బంది తీవ్రంగా శ్రమించి.. . మైదానంలో చిత్తడిగా ఉన్న చోట పెద్ద పెద్ద స్పాంజ్‌లను ఉపయోగించి తడి లేకుండా చేశారు. తడిగా ఉన్న ప్రాంతాల్లో ఇసుక కూడా వేసి ఫ్యాన్లతో ఆరబెట్టేందుకు ప్రయత్నించారు. అంపైర్లు కూడా మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించేందుకు మూడుసార్లు మైదానాన్ని బాగా పరిశీలించారు. 9 గంటలకు మ్యాచ్ ప్రారంభించాలనుకున్నారు. కానీ అప్పుడే మరోసారి వర్షం భారీగా కురిసింది. దీంతో చేసేదేమి లేక మ్యాచ్‌ను రిజర్వ్ డేకు వాయిదా వేశారు అంపైర్స్.
-
Chairs gathered in large number to watch #INDvsPAK match.
— Himanshu Pareek (@Sports_Himanshu) September 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
-On a serious note, these empty stands unacceptable in such big clash for whatever reasons. pic.twitter.com/GnKMJqnWYE
">Chairs gathered in large number to watch #INDvsPAK match.
— Himanshu Pareek (@Sports_Himanshu) September 10, 2023
-On a serious note, these empty stands unacceptable in such big clash for whatever reasons. pic.twitter.com/GnKMJqnWYEChairs gathered in large number to watch #INDvsPAK match.
— Himanshu Pareek (@Sports_Himanshu) September 10, 2023
-On a serious note, these empty stands unacceptable in such big clash for whatever reasons. pic.twitter.com/GnKMJqnWYE
భారత జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ జట్టు.. బాబార్ అజామ్ (కెప్టెన్), షాదబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అలీ అఘా, ఇఫ్తికార్ అహ్మద్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫహీమ్ అష్రఫ్, నజీమ్ షా, షహీన్ అఫ్రిదీ, హరీస్ రౌఫ్
Asia Cup 2023 Sl vs Ban : సూపర్ 4 లో శ్రీలంక శుభారంభం.. రెండో ఓటమితో బంగ్లా ఫైనల్ ఆశలు సంక్లిష్టం!