ETV Bharat / sports

Asia Cup 2023 Final IND Vs SL : ఆసియా కప్​లో 'లంక' ఆటే వేరు.. కొలంబోలో వారిదేపైచేయి.. భారత్​కు గట్టి సవాలే! - ఆసియా కప్​ 2023 భారత్​ శ్రీలంక ఫైనల్​

Asia Cup 2023 Final IND Vs SL : ఆసియా కప్‌ అంటే చాలు.. ఎప్పుడూ శ్రీలంక విరుచుకుపడుతోంది. ఎక్కడా లేని ఉత్సాహంతో మైదానంలో ఆడుతోంది. ఆ ఆటతీరుతోనే ఈ ఏడాది ఆసియా కప్​ ఫైనల్​కు చేరుకుంది. అయితే లంక గత రికార్డులు టీమ్​ఇండియా అభిమానులను కలవరపెడుతున్నాయి. అవేంటంటే?

Asia Cup 2023 Final IND Vs SL
Etv Asia Cup Asia Cup 2023 Final IND Vs SLFinal IND Vs SL
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 12:35 PM IST

Updated : Sep 15, 2023, 12:46 PM IST

Asia Cup 2023 Final IND Vs SL : మినీ టోర్నీ ఆసియా కప్​-2023 చివరి దశకు చేరుకుంది. అయితే ఈ టోర్నీలో మరోసారి చిరకాల ప్రత్యర్థులు భారత్​- పాకిస్థాన్​ మధ్య ఫైనల్​ మ్యాచ్​ను చూడాలనుకున్న ఫ్యాన్స్​ కల కలగానే మిగిలిపోయింది. గురువారం జరిగిన సూపర్​-4 మ్యాచ్​లో పాకిస్థాన్​ను చిత్తు చేసిన శ్రీలంక.. 11వ సారి ఫైనల్​కు దూసుకెళ్లింది.

ఆసియా కప్​లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. కప్పు కొట్టడం అలవాటుగా మార్చుకుంది శ్రీలంక సేన. గతేడాది కూడా ఫైనల్​ చేరడమే కష్టం అనుకుంటే ఏకంకా ట్రోఫీనే పట్టేసింది. ఈసారి కూడా క్రీడా విశ్లేషకులు భారత్​, పాక్​ ఫైనల్​ చేరుకుంటాయని జోస్యం చెప్పగా.. లాస్ట్​ బాల్​ థ్రిల్లింగ్​ మ్యాచ్​లో గెలిచి లంక ఫైనల్​ చేరింది. ఆదివారం.. టీమ్​ఇండియాతో పోటీపడనుంది.

టీమ్​ఇండియా ఫైనల్​కు చేరుకుందన్న విషయం పక్కనపెడితే.. అభిమానులను మరో విషయం తీవ్రంగా కలవరపెడుతోంది. స్వదేశంలో శ్రీలంకకు ఆసియా కప్​లో తిరుగులేని రికార్డు ఉంది. గతంలో నాలుగుసార్లు ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన శ్రీలంక.. మూడుసార్లు ఆ జట్టే విజేతగా నిలిచింది. ఒక్కసారి మాత్రమే 2010లో భారత్​ విజయం సాధించింది.

Asia Cup 2023 Final : సెప్టెంబర్​ 17వ తేదీన ఫైనల్​ జరగబోతున్న కొలంబోలో కూడా శ్రీలంక రికార్డు మరింత మెరుగ్గా ఉంది. అక్కడ ఫైనల్​ మ్యాచ్​ జరిగిన ప్రతీసారి లంకనే గెలిచింది. 2010లో భారత్​ కప్​ను గెలిచినప్పుడు.. ఫైనల్​ మ్యాచ్​ డంబుల్లాలో జరిగింది. ధోనీ కెప్టెన్సీలోని టీమ్​ఇండియా.. ఆ ఫైనల్లో 81 పరుగులతో లంకను చిత్తు చేసి ఆసియా కప్ గెలిచింది.

స్వదేశంలో శ్రీలంక ఆసియా కప్ రికార్డులు ఇవే

  • ఆసియా కప్​ను శ్రీలంక తొలిసారి 1986లో గెలుచుకుంది. అప్పుడు కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్​లో పాకిస్థాన్​ను 5 వికెట్లతో చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది శ్రీలంక.
  • 1997లో శ్రీలంక రెండోసారి ట్రోఫీ గెలిచింది. ఇప్పుడు ఫైనల్ జరగబోతున్న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే అప్పుడు కూడా ఫైనల్ జరిగింది. ఆ మ్యాట్​లో భారత్​ను 8 వికెట్లతో ఓడించి శ్రీలంక టైటిల్ కొట్టేసింది.
  • 2004లోనూ సీన్​ రిపీట్​. ప్రేమదాస స్టేడియంలో ఫైనల్ జరగ్గా.. శ్రీలంక 25 పరుగులతో గెలిచి ఆసియా కప్​ను మూడోసారి కైవసం చేసుకుంది.
  • చివరిసారి శ్రీలంకలో 2010లో ఆసియా కప్ జరిగింది. అప్పుడు ఫైనల్ డంబుల్లాలోని రణగిరి డంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్​లో శ్రీలంకను 81 పరుగులతో చిత్తు చేసిన భారత్​.. ఆసియా కప్ గెలిచింది.

అండర్ డాగ్స్‌తో డేంజరే..
Asia Cup 2023 Sri Lanka Records : ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్​ శ్రీలంక బరిలోకి దిగినా.. ఫైనల్ చేరుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్య రీతిలో భారత్​ చేతుల్లో ఓడినా.. బంగ్లాదేశ్, పాకిస్థాన్​లను చిత్తు చేసి ఫైనల్ చేరింది. సూపర్ 4లో ఒకింత టీమ్​ఇండియాను భయపెట్టింది. పాకిస్థాన్​తో శ్రీలంక ఆడిన విధానం చూస్తే మాత్రం ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. అందులోనూ స్వదేశం, పైగా తమకు బాగా కలిసొచ్చే ప్రేమదాస స్టేడియంలో ఈసారి లంక మళ్లీ ఏం మాయ చేస్తుందో అన్న ఆందోళన అటు టీమ్​ఇండియాలో, ఇటు అభిమానుల్లో ఉంది.

Last Updated : Sep 15, 2023, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.