మహిళల ఆసియా కప్‌లో టీమ్‌ఇండియా శుభారంభం చేసింది. గ్రూప్ స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లంక 18.2 ఓవర్లలో కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. హాసిని పెరెరా (30*) టాప్ స్కోరర్. ఓపెనర్ హర్షిత మాధవి (26) ఫర్వాలేదనిపించింది. మిగతా బ్యాటర్లలో చమరి ఆటపట్టు 5, మల్షా షెహాని 9, నీలాక్షి డి సిల్వా 1, అనుష్క 5, రనసింగె 1, సుగందిక 4 పరుగులు చేశారు. భారత బౌలర్లలో దయాలన్ హేమలత 3, పూజా వస్త్రాకర్ 2, దీప్తి శర్మ 2, రాధా యాదవ్ ఒక వికెట్ తీశారు.
కాగా, జెమీమా రోడ్రిగ్స్ (76) అద్భుతమైన అర్ధశతకం నమోదు చేయడం వల్ల టీమ్‌ఇండియా 150 పరుగులు చేయగలిగింది. భారత ఇన్నింగ్స్‌లో నాలుగు ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లు మంధాన, షఫాలీ పెవిలియన్‌కు చేరారు. దీంతో 4 ఓవర్లకు టీమ్‌ఇండియా స్కోరు 23/2. తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన జెమీమా-హర్మన్ (33) కలిసి మూడో వికెట్‌కు 92 పరుగులు జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వీరిద్దరిపాటు పూజా వస్త్రాకర్ (1), రిచా ఘోష్ (9) వికెట్లు పడటంతో భారీ స్కోరు సాధించడంలో టీమ్‌ఇండియా విఫలమైంది. హేమలత 13 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రనసింగె 3.. సుగందిక కుమారి, చమరి ఆటపట్టు చెరో వికెట్ తీశారు.
ఇదీ చూడండి: ఇర్ఫాన్ పఠాన్ కుమారుడితో సచిన్ కన్వర్సేషన్.. వీడియో వైరల్