Virat Kohli Rohith Sharma : ఆసియా కప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి టీమ్ఇండియా శుభారంభం చేసింది. అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే..
భారత్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏడో ఓవర్ బౌలింగ్ వేయడానికి పాక్ బౌలర్ షాదబ్ ఖాన్ వచ్చాడు. అతడి బౌలింగ్‌లో కోహ్లీ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఆ బంతి నేరుగా నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ మీదకు దూసుకెళ్లింది. వేగంగా బంతి రావడం వల్ల ఒక్కసారిగా షాక్‌కు గురైన రోహిత్ తన చేతిని అడ్డుపెట్టాడు. బంతి నేరుగా హిట్‌మ్యాన్ చేతికి తగిలి పక్కకు వెళ్లిపోగా, అతడు మాత్రం నేలపై పడిపోయాడు. అప్రమత్తమైన రోహిత్ వెంటనే లేచి పరుగు పూర్తి చేశాడు.
కాగా, చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించింది టీమ్ఇండియా. తొలుత పాక్ జట్టు.. 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ఆలౌట్ కాగా.. భారత్ క్రికెట్ జట్టు ఆ లక్ష్యాన్ని ఐదు వికెట్ల తేడాతో ఛేదించింది.
- — Yoloapp (@Yoloapp2) August 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
— Yoloapp (@Yoloapp2) August 28, 2022
">— Yoloapp (@Yoloapp2) August 28, 2022
ఇవీ చదవండి: టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, స్టార్ పేసర్ వచ్చేస్తున్నాడు