England vs Australia Fifth Test : ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా సాగిన యాషెస్ సిరీస్‌కు గొప్ప ముగింపు దక్కింది. ఐదో టెస్ట్ ఆఖరి రోజు ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. ఓ వైపు వర్షం దోబూచులాట... మరోవైపు ఊరిస్తున్న విజయం.. అభిమానుల ఉత్కంఠ నడుమ హోరాహోరీగా మ్యాచ్ సాగింది. చివరికి ఇంగ్లాండ్‌ను విజయం వరించింది. ఆఖరి టెస్టులో 49 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని సిరీస్‌ను 2-2తో సమం చేసింది ఇంగ్లాండ్. అయితే గత యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను విజయం వరించడం వల్ల ట్రోఫీ ఆ జట్టు దగ్గరే కొనసాగుతుంది.
England won ashes 2023 5th test : ఐదో టెస్టులో 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. నాలుగో రోజు 135/0తో పటిష్టంగా నిలిచింది. దీంతో విజయం ఆ జట్టునే వరిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆసీస్ బ్యాటర్లను.. ఆఖరి రోజు ఇంగ్లాండ్ బౌలర్లు గట్టిగానే కట్టడి చేశారు. వారు అద్భుత ప్రదర్శన చేసి తమ టీమ్‌ను గెలిపించిన తీరు ఎంతో గొప్పగా ఉంది. ఆట ప్రారంభమైన కాసేపటికే.. వార్నర్ (60), ఖవాజా (72)లను ఔట్ చేశాడు వోక్స్ (4/50). అలా చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్ మంచి ఆరంభం దక్కింది. ఆ తర్వాత క్రీజోలోకి వచ్చిన లబుషేన్ (11) ఎక్కువసేపు ఉండలేకపోయాడు. దీంతో ఆసీస్ 169/3 స్కోరుకు చేరుకుంది. అయితే ఈ దశలో స్టీవ్ స్మిత్ (54), ట్రావిస్ హెడ్ (43) మంచి రాణించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దీంతో ఆసీస్ పంచుకుంది.
stuart broad ashes 2023 : 238/3తో గెలుపు వైపు సాగుతున్న సమయంలో.. వర్షం ఆటంకం కలిగించింది. దీంతో దాదాపు రెండు గంటలకు పైగా ఆట నిలిచిపోయింది. అనంతరం ఆట ప్రారంభమయ్యాక.. మళ్లీ ఆసీస్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆ సమయంలో హెడ్‌ను మొయిన్ అలీ.. స్మిత్‌ను వోక్స్ ఔట్ చేసి వారి దూకుడుకు కళ్లెం వేశారు. ఇక అక్కడి నుంచి కథ యూటర్న్ తీసుకుంది. వరుసగా వికెట్ల పతనం కొనసాగింది. 35 ఓవర్ల ఆట మిగిలిఉండగానే.. ఆసీస్ 294/8తో ఆలౌట్ దశకు దగ్గరికి చేరింది. అప్పుడు కేరీ (28), మర్ఫీ (18) పోరాడేందుకు ప్రయత్నించారు. మళ్లీ ఆసీస్‌లో ఆశలు చిగురించాయి. కానీ అది ఎక్కువ సేపు నిలువలేదు. ఈ మ్యాచ్‌తో ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రాడ్.. బౌలింగ్ బరిలో దిగి మర్ఫీ, కేరీలను ఔట్ చేశారు. ఇంగ్లాండ్‌కు గొప్ప విజయాన్ని అందించి కెరీర్‌ను గొప్పగా ముగించాడు. దీంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. కాగా, ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 283, ఆస్ట్రేలియా 295 పరుగులు సాధించాయి. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 395 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
ఇదీ చూడండి :
Ashes series Eng vs Aus 5th test 2023 : వార్నర్ హైలైట్ రికార్డ్.. ఐదో టెస్టులో కీలక మలుపు
Stuart Broad On Yuvraj Singh : యువరాజ్ వల్లే సక్సెస్ అయ్యా.. ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేను : బ్రాడ్