Ashes 2021: యాషెస్ సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లో ఆడిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ నో-బాల్‌కు ఔటవ్వడం, అది నాటౌట్‌గా ప్రకటించడం.. చిరాకు తెప్పించిందని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ అన్నాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్ (17) పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తుండగా స్టోక్స్ వేసిన ఓ బంతికి బౌల్డ్ అయ్యాడు. అయితే, రీప్లేలో ఆ బంతి నో-బాల్‌గా పడిందని తేలింది. స్టోక్స్ బౌలింగ్ చేసేటప్పుడు క్రీజు బయట కాలు పెట్టి బౌలింగ్ చేశాడని స్పష్టమైంది. అలాగే అంతకుముందు అతడు వేసిన మరిన్ని బంతులు కూడా నో-బాల్స్‌గానే పడ్డాయని, సాంకేతిక కారణాల రీత్యా ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ గుర్తించలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ వివాదాస్పద అంశంపై స్టోక్స్ తాజాగా స్పందించాడు.
'డేవిడ్ వార్నర్ ఆదిలోనే నో-బాల్‌కు బౌల్డ్ కావడం, అది తర్వాత గుర్తించి నాటౌట్‌గా ప్రకటించడం చిరాకు తెప్పించింది. అయితే, అది నో-బాల్ అని నాకు ముందే తెలుసని కొందరు అన్నారు. కానీ, అది నిజం కాదు. వార్నర్ బౌల్డ్ అయ్యాక అంపైర్ల వైపు చూస్తే.. వాళ్లు ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అది నో-బాల్ అయి ఉంటుందని నేను అనుకున్నా. అయితే, అంతకుముందు కూడా పలు బంతులను అలాగే వేశానని గుర్తించారు. నేను క్రీజు లోపల నుంచే బౌలింగ్ చేయాలి. కానీ, ఒక బౌలర్‌గా నేను నో-బాల్స్ వేస్తుంటే అంపైర్లు గుర్తించి హెచ్చరించాలి. అది వార్నర్ బౌల్డ్ అయ్యేంతవరకు నాకు ఎవరూ చెప్పలేదు. అప్పటికే ఆలస్యమైంది' అని స్టోక్స్ ఓ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు.
కాగా, వార్నర్ (94) తర్వాత భారీ ఇన్నింగ్స్ ఆడాడు. చివరకు ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో ఆ మ్యాచ్‌లో గెలుపొందింది.
ఇదీ చదవండి:
Ashes 2021-22: ఇంగ్లాండ్ జట్టుపై జరిమానా.. కారణమిదే..
ఇంగ్లాండ్‌పై ఆసీస్ విజయం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్కు!