Ashes Proposal: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇరుజట్లు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్ చూస్తున్న వీక్షకుల స్టాండ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ ఇంగ్లాండ్ ఫ్యాన్, ఆస్ట్రేలియా అభిమానికి ప్రపోజ్ చేశాడు. దీంతో అక్కడి వాతావారణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిపోయింది. ఆమె కూడా ఓకే చెప్పడం వల్ల స్టేడియమంతా అరుపులు, కేకలతో నిండిపోయింది.
ఇంగ్లాండ్‌లోని ఫేమస్ బర్మీ ఆర్మీ(ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు అభిమానుల సమూహం)కి చెందిన రాబ్ హేల్ ఆస్ట్రేలియాకు చెందిన నటాలియాకు స్టాండ్స్‌లోనే ప్రపోజ్ చేశాడు. రింగ్ చూపించి తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఇది చూసిన నటాలియా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. తర్వాత తేరుకుని అతడిని కౌగిలిలో బంధించి ముద్దుల్లో ముంచెత్తింది. ఇది కాస్తా కెమెరాల్లో రికార్డు కావడం వల్ల ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అలాగే ఈ సన్నివేశాన్ని బర్మీ ఆర్మీ కూడా ట్వీట్ చేసింది. "వారిద్దరూ 2017లో జరిగిన యాషెస్‌లో కలుసుకున్నారు. ఈ యాషెస్‌లో ఒక్కటయ్యారు" అంటూ వారికి శుభాకాంక్షలు తెలిపింది.
-
YES 🙌
— England’s Barmy Army (@TheBarmyArmy) December 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Massive shoutout to Rob Hale, he met Natalie back in 2017 during the last #Ashes with the Barmy Army!
Congrats guys 🇦🇺🏴
pic.twitter.com/iZsLTxSGAi
">YES 🙌
— England’s Barmy Army (@TheBarmyArmy) December 10, 2021
Massive shoutout to Rob Hale, he met Natalie back in 2017 during the last #Ashes with the Barmy Army!
Congrats guys 🇦🇺🏴
pic.twitter.com/iZsLTxSGAiYES 🙌
— England’s Barmy Army (@TheBarmyArmy) December 10, 2021
Massive shoutout to Rob Hale, he met Natalie back in 2017 during the last #Ashes with the Barmy Army!
Congrats guys 🇦🇺🏴
pic.twitter.com/iZsLTxSGAi
దీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్
ENG vs AUS Ashes 2021: ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 147 పరుగులకు ఆలౌటవ్వగా.. ఆస్ట్రేలియా 425 పరుగులు చేసింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు దీటుగా బదులిస్తోంది. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయినా.. రూట్, మలన్ అద్వితీయంగా పోరాడుతున్నారు. ప్రస్తుతం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 2 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రూట్ (86*), మలన్ (80*) సెంచరీల దిశగా దూసుకెళ్తున్నారు. ఇంకా 58 పరుగుల వెనకంజలో ఉంది రూట్‌సేన.