ETV Bharat / sports

Ashes 2021: తొలి టెస్టులో పట్టుబిగిస్తున్న ఆసీస్.. ఇంగ్లాండ్ 107/2 - యాషెస్ 2021 లైవ్ అప్​డేట్స్

Ashes 2021 live: బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టులో ఆసీస్ పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్​లో 425 పరుగులకు ఆలౌటైన కంగారూ జట్టు కీలక ఆధిక్యం సంపాదించింది. ప్రస్తుతం టీ విరామ సమయానికి రెండో ఇన్నింగ్స్​లో 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది ఇంగ్లాండ్.

Ashes 2021 latest news, యాషెస్ లేటెస్ట్ న్యూస్
Ashes 2021
author img

By

Published : Dec 10, 2021, 10:38 AM IST

Ashes 2021 live: యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా పట్టుబిగిస్తోంది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 425 పరుగులకు ఆలౌటైంది. 343/7తో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్​ మరో 62 పరుగులు జోడించి ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్​లో 278 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ట్రెవిస్ హెడ్ (152) భారీ శతకంతో అదరగొట్టగా.. స్టార్క్ (35) అతడికి మద్దతుగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో రాబిన్సన్, మార్క్ వుడ్ చెరో మూడు వికెట్లతో రాణించగా క్రిస్ వోక్స్ 2, లీచ్, రూట్ చెరో వికెట్ సాధించారు.

ఇక రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఇంగ్లాండ్ మూడో రోజు టీ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. బర్న్స్ (13), హమీద్ (27) మరోసారి విఫలమయ్యారు. రూట్ (26), మలన్ (35) క్రీజులో ఉన్నారు. ఇంకా 171 పరుగులు వెనకపడి ఉంది ఇంగ్లీష్ జట్టు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.