టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు రిషికేశ్ తీర్థ యాత్రకు వెళ్లారు. అక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్యాత్మిక గురువైన స్వామి దయానంద్ సరస్వతీ ఆశ్రమాన్ని సందర్శించారు. దయానంద్ సమాధిని దర్శించుకుని ఆశిస్సులను తీసుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనుకు రానుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయి. నాగ్‌పుర్‌లో ఫిబ్రవరి 9న తొలి టెస్టు ప్రారంభంకానుంది. దీంతో పాటే ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కూడా జరగనుంది. దీంతో భారత్‌కు ఈ టెస్టు సిరీస్ కీలకం కానుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. ఇక పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న టీమ్ఇండియా కూడా ఈ ఫైనల్ బెర్తుపై కన్నేసింది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఫామ్ అందుకోవడం, అలానే జట్టులో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి హిట్టర్లు తొలి రెండు టెస్టులకు ఆడనుండటం భారత్‌కు కలిసొచ్చే అవకాశం.
ఇకపోతే అనుష్క శర్మ.. ప్రస్తుతం అనుష్క శర్మ చక్దా ఎక్స్‌ప్రెస్ అనే క్రికెట్ బయోపిక్‌లో నటిస్తోంది. మాజీ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి జీవితకథగా ఈ చిత్రం రూపొందనుంది.
ఇవీ చదవండి:
ఉందిలే మంచి కాలం.. మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ
పాక్ క్రికెట్ బోర్డు కొత్త ప్రయత్నం.. క్రికెట్ చరిత్రలోనే తొలిసారి అలా..