ETV Bharat / sports

'రోహిత్​'కు మెసేజ్ చేయాలని ఉంది - ఆ విషయంలో అతడికి థాంక్స్ చెప్పాలి - రోహిత్ శర్మకు అనన్య పాండే మెసేజ్

Ananya Pandey On Rohit Sharma : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మెసేజ్ చేయాలనున్నట్లు, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే తెలిపింది. ఆదివారం భారత్ - ఆస్ట్రేలియా టీ20 ప్రీ మ్యాచ్ షో లో పాల్గొన్న ఆమె ఈ విషయం చెప్పింది.

ananya pandey on rohit sharma
ananya pandey on rohit sharma
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 12:58 PM IST

Updated : Dec 4, 2023, 1:13 PM IST

Ananya Pandey On Rohit Sharma : బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే - ఆదర్ష్ గౌరవ్ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన చిత్రం 'కో గయే హమ్ కహా'. ఈ సినిమా డిసెంబర్ 26 న ఓటీటీ వేదిక నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రమోషన్స్​లో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే జియో సినిమా స్టూడియోస్​లో భారత్ - ఆస్ట్రేలియా 5వ టీ20 ప్రీ మ్యాచ్ షోకు హాజరైంది హీరోయిన్ అనన్య.

ఈ షోలో వ్యాఖ్యాత క్రికెటర్​ గురించి అడిగిన ఓ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చింది అనన్య. ' ఏ క్రికెటర్​కు నువ్వు డీఎమ్ ( డైరెక్ట్ మెసేజ్) చేయాలనుకుంటున్నావ్'? అని యాంకర్ అడిగాడు. దీనికి సమాధానంగా 'నేను రోహిత్ శర్మకు మేసేజ్ చేయాలనుకుంటున్నా. అతడు నిజంగా అద్భుతమైన కెప్టెన్. వన్డే ప్రపంచకప్​లో రోహిత్ టీమ్ఇండియాను నడిపిన తీరు అద్భుతం. అతడికి థాంక్స్ చెప్పాలనుకుంటున్నా' అని అనన్య అంది. అలాగే టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సైతం ఈ బ్యూటీ ప్రశంసించింది. 'విరాట్ కోహ్లీ ఆల్​ టైమ్ గ్రేటెస్ట్ ప్లేయర్. గేమ్ పట్ల విరాట్ నిబద్ధతతో ఉంటాడు. మ్యాచ్ సమయంలో అతడు తన సతీమణి అనుష్క శర్మతో మాట్లాడే విధానం బాగుటుంది' అని చెప్పింది.

Kho Gaye Hum Kahan Cast : 'కో గయే హమ్ కహా' చిత్రాన్ని అర్జున్ వారియర్ సింగ్.. రొమాంటిక్ డ్రామాగా తెరెక్కించారు. రచయితలు జోయా అక్తర్, రీమా కగ్టీ ఈ సినిమాకు కథ అందించారు. అనన్య, ఆదర్ష్​తో పాటు నటుడు సిద్ధాంత్ చతుర్వేది సినిమాలో కీలక పాత్ర పోషించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఆదివారం జరిగిన 5వ టీ20లో టీమ్ఇండియా, ఆసీస్​పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో భారత్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ 154-8 కే పరిమితమైంది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (53) హాఫ్ సెంచరీ బాదగా, అక్షర్ పటేల్ (31 పరుగులు, 1 వికెట్ ) ఆల్​రౌండ్ ప్రదర్శనతో రాణించాడు.

ఆదిత్య​తో అనన్య మూవీడేట్!- లవ్​ కహానీపై 'లైగర్' బ్యూటీ క్లారిటీ!

రోహిత్​ - టీమ్ఇండియాకు నువ్వు కావాలయ్యా!

Last Updated : Dec 4, 2023, 1:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.