Amitabh Bachchan World Cup Final : 2023 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ మరో రెండు రోజుల్లో జరగనుంది. తుదిపోరులో భారత్.. ఐదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు బీసీసీఐ.. భారీగానే ప్లాన్స్ వేస్తోంది. ఈ మ్యాచ్‌కు ఇరు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్రమోదీ, ఆంటొని ఆల్బనీస్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది టీమ్ఇండియా ఫ్యాన్స్ మాత్రం బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్.. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి రావొద్దంటూ ఆయనకు స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇటీవల జరిగిన సెమీస్‌లో భారత్.. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సంగంతి తెలిసిందే. అయితే స్టార్ హీరో అమితాబ్.. 'నేను మ్యాచ్ చూడకపోతే.. మనం గెలిచాం' అని సెమీస్ అనంతరం ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో సెంటిమెంట్ ఎక్కువగా ఫాలో అయ్యే టీమ్ఇండియా ఫ్యాన్స్.. 'ఫైనల్ మ్యాచ్‌కు కూడా రాకండి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
'ఒక్కసారికి మ్యాచ్ చూడకండి', 'ఫైనల్ మ్యాచ్‌కు మీరు రావొద్దు', 'మీరు మ్యాచ్‌కు దూరంగా ఉండండి' అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. వీటికి స్పందించిన అమితాబ్.. 'ఇవన్నీ చూశాక, మ్యాచ్‌కు వెళ్లాలా? వద్దా? అని ఆలోచిస్తున్నా' అని సరదాగా మరో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అమితాబ్ పోస్ట్‌లు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
-
T 4832 - अब सोच रहा हूँ, जाऊँ की ना जाऊँ !
— Amitabh Bachchan (@SrBachchan) November 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 4832 - अब सोच रहा हूँ, जाऊँ की ना जाऊँ !
— Amitabh Bachchan (@SrBachchan) November 16, 2023T 4832 - अब सोच रहा हूँ, जाऊँ की ना जाऊँ !
— Amitabh Bachchan (@SrBachchan) November 16, 2023
-
T 4831 - when i don't watch we WIN !
— Amitabh Bachchan (@SrBachchan) November 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 4831 - when i don't watch we WIN !
— Amitabh Bachchan (@SrBachchan) November 15, 2023T 4831 - when i don't watch we WIN !
— Amitabh Bachchan (@SrBachchan) November 15, 2023
కప్పుమనదే.. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్.. భారత్ వరల్డ్‌కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రీసెంట్గా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ను ఆయన ముంబయి వెళ్లి ప్రత్యక్షంగా చూశారు. మ్యాచ్ అనంతరం చెన్నై తిరిగి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. 'ఈసారి 100 పర్సెంట్ టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలుస్తుంది' అని అన్నారు.
మ్యాచ్‌కు ముందు విన్యాసాలు.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు.. భారత్ నేవీకి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ టీమ్.. గగనతలంలో విన్యాసాలు చేయనుంది. మ్యాచ్ ప్రారంభానికి 10 నిమిషాల ముందు.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ విన్యాసాలు ప్రేక్షకుల్ని అలరించనున్నాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
'విరాట్ 50 సెంచరీల రికార్డు బాబర్ బ్రేక్ చేస్తాడు!'- కమ్రాన్ అక్మల్
భారత్Xఆస్ట్రేలియా ఫైనల్ - ఇట్స్ రివెంజ్ టైమ్! - ఆసీస్‌ను కొట్టాల్సిందే