ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడిగా తెరంగేట్రం చేసి.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆకాశ్. పలు సూపర్‌హిట్ చిత్రాల్లో బాల నటుడిగా మెరిసిన ఆయన 'ఆంధ్రాపోరి' సినిమాతో హీరోగా మారాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'చోర్ బజార్' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆకాశ్ 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశాడు. వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు పంచుకున్నాడు.
'ధోనీ' సినిమాకుగానూ తొలిసారి పారితోషకం అందుకున్నానని చెప్పాడు ఆకాశ్. తన తండ్రి దర్శకుడుకాక ముందు ఓ సీనియర్ నటిని చూసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అక్కడి నుంచి పంపించేశారని, ఇప్పుడు ఆ నటితో తాను కలిసి నటించడం అదృష్టమని పేర్కొన్నాడు. పదో తరగతికే ఎంబీబీఎస్ చేసినట్టు ఫీలయ్యానని, అందుకే జిమ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేశానని తెలిపాడు. నటుడు రామ్‌చరణ్ తనకు పలు రకాలుగా హెయిర్ స్టైల్ చేసేవారని నాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. ఈ ఆసక్తికర ఇంటర్వ్యూ జూన్ 13న 'ఈటీవీ'లో రాత్రి 9: 30 గం.లకు ప్రసారంకానుంది.
ఇదీ చూడండి: 'రూ.10 కోసం అమ్మ పడిన కష్టం చూశా.. అందుకే ఆ లక్ష్యంతో పనిచేస్తున్నా...'