Ajaz Patel Record: భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ స్పిన్ బౌలర్ అజాజ్ పటేల్ అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టాడు. టెస్టులో పది వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టు క్రికెట్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డు సాధించాడు. భారత సంతతికి చెందిన ఈ ఆటగాడిపై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు.
"అజాజ్ పటేల్.. 10 వికెట్ల క్లబ్‌లోకి స్వాగతం. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన. తొలి రోజు, రెండో రోజు ప్రత్యేక కృషితో 10 వికెట్లు సాధించడం గర్వించాల్సిన విషయం."
--అనిల్ కుంబ్లే, టీమ్ఇండియా మాజీ బౌలర్.
"క్రికెట్లో ఈ ఫీట్ సాధించడం చాలా కష్టం. ఒకే బౌలర్ 10 వికెట్లు తీయడం అంటే మామూలు విషయం కాదు. అజాజ్ పటేల్‌కు అభినందనలు."
--రవిశాస్త్రి, టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్.
భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టుకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్.. అజాజ్ పటేల్‌ను కొనియాడాడు. గత 15 ఏళ్లుగా కివీస్ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తుండటం ఆనందంగా ఉందని అన్నాడు.
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా అజాజ్ రికార్డుపై స్పందించాడు. కివీస్ స్పిన్నర్ అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచాడని అన్నాడు.
ముగ్గురే..
1956లో తొలిసారి జిమ్‌లేకర్ ఆస్ట్రేలియాపై 10 వికెట్ల ఘనత సాధించాడు. అనంతరం 1999లో అనిల్ కుంబ్లే.. పాక్ జట్టుపై ఈ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం ఈ జాబితాలో అజాజ్ చేరాడు. 1985లో కివీస్ ఆటగాడు రిచర్డ్ హడ్లీ(9/52) ఆస్ట్రేలియాపై మేటి ప్రదర్శన చేశాడు.
ఇదీ చదవండి:
IND vs NZ Test: చరిత్ర సృష్టించిన అజాజ్.. భారత్ 325 ఆలౌట్
Ajaz Patel Record: నీకో దండం సామి.. 10 వికెట్లు ఎలా తీశావయ్యా!