ETV Bharat / sports

IPL 2022: అహ్మదాబాద్​ ఫ్రాంచైజీకి లైన్​క్లియర్! - అహ్మదాబాద్​ ఫ్రాంచైజ్

Ahmedabad Franchise IPL: బెట్టింగ్​ సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీవీసీ క్యాపిటల్​కు ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇచ్చేందుకు లైన్​క్లియర్​ అయినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా బీసీసీఐ లీగల్​ కమిటీ సీవీసీకి గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.

bcci
ఐపీఎల్​లో అహ్మదాబాద్​ ఫ్రాంఛైజీకి లైన్​క్లియర్!
author img

By

Published : Dec 23, 2021, 2:44 PM IST

Ahmedabad Franchise IPL: ఐపీఎల్​లో భాగంగా అహ్మదాబాద్​ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సీవీసీ క్యాపిటల్​కు బెట్టింగ్​ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐపీఎల్​లో అహ్మదాబాద్​ జట్టు ఎంట్రీపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా సీవీసీ క్యాపిటల్​కు లైన్​క్లియర్​ అయినట్లు తెలుస్తోంది. ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన బీసీసీఐ లీగల్​ కమిటీ.. గ్రీన్​స్నిగల్​ ఇచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి.

అసలు వివాదం ఏంటంటే..

అహ్మదాబాద్​ జట్టుపై యాజమాన్య హక్కులను రూ. 5,625 కోట్లు వెచ్చించి సీవీసీ క్యాపిటల్​ దక్కించుకుంది. అయితే దీనిపై మాజీ ఐపీఎల్​ కమిషనర్​ లలిత్​ మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'బెట్టింగ్​ సంస్థలు కూడా ఐపీఎల్​ జట్లను కొనుగోలు చేస్తున్నట్లు ఉంది. ఇదేదో కొత్త నిబంధన అనుకుంటా. పెద్ద బెట్టింగ్​ కంపెనీ ఒకటి ఐపీఎల్​లో అడుగుపెడుతోందట' అంటూ వ్యాఖ్యానించారు. దీంతో బీసీసీఐ విచారణ చేపట్టింది.

అధికారుల వివరాల ప్రకారం..

సీవీసీ క్యాపిటల్.. తమ​ అధికారిక వెబ్​సైట్​లో టిపికో, సిసల్​ అనే బెట్టింగ్​ కంపెనీలను తమ అనుబంధ సంస్థలుగా పేర్కొంది. దీనిపై బీసీసీఐ ప్రశ్నించగా.. సీవీసీకి ఆసియన్​, యూరోపియన్​ అనే రెండు ఫండ్లు ఉన్నాయని సంస్థ వెల్లడించింది. బెట్టింగ్​ చట్టబద్ధమైన దేశాల్లో యూరోపియన్​ ఫండ్స్​ కింద బెట్టింగ్​ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది. అహ్మదాబాద్​ జట్టుకు ఆసియన్​ ఫండ్​ నుంచి పెట్టుబడులు పెట్టినట్లు తెలిపిన సీవీసీ.. ఆసీయన్​ ఫండ్​కు బెట్టింగ్​ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి : ధోనీ రికార్డుకు చేరువలో యువ క్రికెటర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.