ETV Bharat / sports

క్రికెట్​ బోర్డుపై అవినీతి ఆరోపణలు.. ఆటకు స్టార్ ఓపెనర్​ గుడ్​బై! - అఫ్గాన్ క్రికెట్​ బోర్డుపై ఉస్మాన్​ ఘని కామెంట్స్​

Usman Ghani Retirement : అఫ్గానిస్థాన్​ స్టార్​ క్రికెటర్​ ఉస్మాన్​ ఘని ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్​ వేదికగా ప్రకటించాడు. ఇంతకీ ఆయన నిర్ణయం ఏంటంటే ?

Usman Ghani Comments On ACB
స్టార్​ క్రికెటర్​ కీలక​ నిర్ణయం.. అప్పటివరకు ఆటకు దూరంగా ఉంటానంటూ..!
author img

By

Published : Jul 4, 2023, 6:21 PM IST

Usman Ghani Retirement : అఫ్గానిస్థాన్​ క్రికెట్​లో స్టార్​ ఓపెనర్​గా సెన్సేషన్ సృష్టించిన ఉస్మాన్​ ఘని ఇటీవలే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్​ వేదికగా తెలిపాడు. అఫ్గానిస్థాన్ క్రికెట్​ బోర్డు (ఏసీబీ) మేనేజ్​మెంట్​తో పాటు సెలక్షన్​ కమిటీలో మార్పు వచ్చేంతవరకు అతను క్రికెట్​కు దూరంగా ఉంటానంటూ వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా ఆ దేశ క్రికెట్​ బోర్డు పెద్దల​పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేస్తూ వరుస ట్వీట్స్​ చేశాడు. ఉస్మాన్​ ఘని తీసుకున్న ఈ నిర్ణయంతో అఫ్గాన్​ క్రికెట్​ బోర్డు అధికారులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

"అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాకే అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ నుంచి విరామం తీసుకుందామని నిర్ణయించుకున్నాను. అవినీతి కోరల్లో చిక్కుకున్న అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు పనితీరు నన్ను ఆటకు దూరంగా ఉండేటట్టు చేసింది. కొంతకాలం పాటు ఆటకు దూరంగా ఉంటానేమో కానీ.. ఆటపై పట్టు కోల్పోకుండా నా హార్డ్‌ వర్క్‌ను కొనసాగిస్తూనే ఉంటా. బోర్డులో సరైన మేనేజ్‌మెంట్‌, సెలక్షన్​ కమిటీ వచ్చినప్పుడే గర్వంగా జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇస్తాను. అప్పటివరకు నా దేశం కోసం ఆడేందుకు ఎదురు చూస్తూనే ఉంటా. అనేకసార్లు బోర్డు పెద్దలను కలిసేందుకు ప్రయత్నించాను.. ఏసీబీ ఛైర్మన్ అందుబాటులో లేకపోవడం వల్ల కలవలేకపోయాను. అంతేగాక నన్ను అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పించడంపై చీఫ్ సెలెక్టర్‌ నుంచి ఇప్పటివరకు సరైన సమాధానం కూడా లేదు. దీంతో చేసేదేమీ లేక ఆట నుంచి నేను పాక్షిక విరామం తీసుకున్నాను. "

ఇదీ కారణం..
Afghanistan Cricket Board : జులై 5 నుంచి 11 వరకు బంగ్లాదేశ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ప్రకటించిన జట్టులో ఉస్మాన్​ ఘనికి చోటు దక్కలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఘని.. అఫ్గాన్‌ క్రికెట్ బోర్డు నాయకత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని.. అందుకే తనను వన్డే సిరీస్​కు ఎంపిక చేయలేదని విమర్శలు గుప్పించాడు. బంగ్లాదేశ్​తో ఆడేందుకు తనకు అవకాశం కల్పించకపోవడంపై ప్రస్తుతం ఉన్న చీఫ్ సెలెక్టర్‌ కూడా సరైన సమాధానం ఇవ్వలేదని అన్నాడు. ఈ కారణంతోనే తాను ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెప్పాడు. దీంతో మేనేజ్‌మెంట్‌ మారిన తర్వాతే జట్టులోకి తిరిగి రావాలని భావిస్తున్నట్లుగా ట్విట్టర్​ వేదికగా పేర్కొన్నాడు.

  • After careful consideration, I have decided to take a break from Afghanistan Cricket. The corrupt leadership in the cricket board has compelled me to step back. I will continue my hard work and eagerly await the right management and selection committee to be put in place. 1/3 pic.twitter.com/lGWQUDdIwJ

    — Usman Ghani (@IMUsmanGhani87) July 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Usman Ghani Stats : ఇప్పటివరకు అఫ్గానిస్థాన్‌ తరఫున 17 వన్డేలు, 35 టీ20లు ఆడిన ఘని.. మొత్తంగా 1221 పరుగులు చేశాడు. వీటిల్లో 2 వన్డే హాఫ్​ సెంచరీలు కాగా.. టీ20ల్లో 4 అర్ధసెంచరీలతో పాటు ఒక సెంచరీ కూడా ఉంది. గతేడాది చివరి సారిగా నెదర్లాండ్స్‌తో వన్డే మ్యాచ్‌ ఆడిన ఘని.. ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో పాకిస్థాన్‌తో టీ20 సిరీస్‌ ఆడాడు. అయితే ప్రస్తుతం ఫర్వాలేదనిపించే ఫామ్‌లో ఉన్న ఘనిని సెలెక్టర్లు గత కొంతకాలంగా జాతీయ జట్టుకు ఎంపిక చేయకుండా దూరం పెడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.