అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్(T20 world cup 2021) తర్వాత టీమ్ఇండియా ప్రధానకోచ్(Team India Coach) రవిశాస్త్రి పదవీ కాలం పూర్తవుతుంది. ఈ సందర్భంగా కోచ్‌గా తాను సాధించిన విజయాలను 'ది గార్డియన్' పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన గుర్తు చేసుకున్నాడు(Ravi Shastri News).
హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలుగుతున్నందుకు కొంత బాధగా ఉందని.. కానీ సరైన సమయంలోనే బయటకు వెళ్తున్నానని శాస్త్రి చెప్పుకొచ్చాడు. అనుకున్న దానికంటే ఎక్కువగానే సాధించానని అన్నాడు.
అనుకున్నవన్నీ సాధించా..
"నాకు కావాల్సినవి అన్నీ సాధించాను. ఐదేళ్ల పాటు టెస్టుల్లో టీమ్ఇండియా నెం.1గా కొనసాగింది. ఆస్ట్రేలియాపై రెండు సార్లు గెలిచాం. ఇంగ్లాండ్‌పై విజయం సాధించాం" అని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. జర్నలిస్ట్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ ఆర్థర్టోన్తో గతంలో సంభాషించినప్పుడూ ఇదే చెప్పానని రవిశాస్త్రి అన్నాడు.
ఆ మ్యాచ్‌లు ప్రత్యేకం..
"నావరకైతే టీమ్ఇండియా ఇప్పుడు పతాకస్థాయిలో ఉంది. ఆస్ట్రేలియాను సొంతగడ్డపైనే ఓడించాం. కొవిడ్ సమయంలోనూ ఇంగ్లాండ్‌పై విజయం సాధించాం. ఆ జట్టుపై 2-1తో విజయం సాధించాం. ఓవల్, లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లు ప్రత్యేకం" అని రవిశాస్త్రి(Ravi Shastri News) అన్నాడు. తాము ప్రతి జట్టును.. వారి సొంతగడ్డపైనే ఓడించామని.. ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించటం, కొవిడ్ ఉన్నా ఇంగ్లాండ్‌పై విజయం సాధించటం.. నాలుగు దశాబ్దాల నా క్రికెట్ జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన క్షణాలు అని వివరించాడు.
టీ20 వరల్డ్ కప్‌లో(T20 world cup 2021) టీమ్ఇండియా సమర్థంగా బరిలోకి దిగుతుందన్నాడు. శాయశక్తులా పోరాడుతుందని తెలిపాడు.
దిగ్గజాలతో పనిచేశా..
"ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లతో పనిచేశా. డ్రెస్సింగ్ రూంలో ఎన్నో తీపి అనుభవాలు ఉన్నాయి. అన్నింటికంటే.. నాణ్యమైన క్రికెట్ ప్రదర్శించాం." అన్నాడు.
బుమ్రా టెస్టు క్రికెట్ ఆడతాడని ఎవరూ ఊహించలేదని రవిశాస్త్రి పేర్కొన్నాడు. మూడేళ్ల వ్యవధిలోనే 24 టెస్టుల్లో 101 వికెట్లు తీశాడు. ఇది నమ్మశక్యం కాని విషయని అన్నాడు.
ఇదీ చదవండి: Team India Coach 2021: టీమ్ఇండియా కొత్త కోచ్ ఎవరు..?