Abdul Razzaq Aishwarya Rai : 2023 వన్డే ప్రపంచ కప్‌లో ఆడిన 9 మ్యాచుల్లో 5 మ్యాచులు ఓడిన పాకిస్థాన్.. క్రికెట్ టీమ్ లీగ్ స్టేజ్‌లోనే పోరు నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు ఆ దేశ మాజీ క్రికెటర్లు. ఈ క్రమంలోనే పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ కూడా స్పందించాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఉద్దేశం సరిగ్గా లేదని.. ఆటగాళ్లు గెలవాలనే పట్టుదల ప్రదర్శించలేదని వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా బాలీవుడ్ ప్రముఖ నటి ఐశ్వర్యారాయ్ పేరును మధ్యలో ప్రస్తావించాడు. ఆమెపై అసభ్యకరమైన కామెంట్స్ చేశాడు. దీంతో ప్రస్తుతం రజాక్ నెట్టింట్ ట్రోలింగ్‌కు గురవుతున్నాడు.
ఇంతకీ ఏమన్నాడంటే?
'పీసీబీ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నేను ప్లేయర్‌గా ఉన్న సమయంలో అప్పటి జట్టు సారథి యూనిస్ ఖాన్ టీమ్‌ను ముందుకు తీసుకువెళ్లిన తీరు అద్భుతంగా ఉండేది. ఆయన నుంచే కాకుండా నా తోటి ఆటగాళ్ల నుంచీ కూడా ఎప్పుడూ స్ఫూర్తి పొందేవాడిని. ఈ కారణంతోనే పాక్ క్రికెట్ కోసం ఎంతోకొంత చేయగలిగాను. అయితే ప్రస్తుతం జట్టు, అందులో ఉన్న ఆటగాళ్లపై బయట అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. 2023 మెగా టోర్నీలో ఘోరమైన ప్రదర్శన తర్వాత అవి మరింత ఎక్కువయ్యాయి' అని విలేఖరులతో జరిగిన ఓ సమావేశంలో అబ్దుల్ రజాక్ వ్యాఖ్యానించాడు.
'ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన..!'
Abdul Razzaq Comments On Aishwarya Rai : మరోవైపు అంశంతో సంబంధం లేకుండా బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ పేరును చర్చలోకి తీసుకువచ్చి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు రజాక్.. జట్టు పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రదర్శిస్తున్న తీరును తప్పుపడుతూ అసలు వారి సంకల్పమే బలంగా లేదన్నాడు. పాకిస్థాన్‌లో క్రికెటర్ల సామర్థ్యానికి పదును పెట్టాలన్న ఉద్దేశమే వారికి లేదంటూ విమర్శించాడు. అలాంటప్పుడు మంచి ఫలితాలు ఎలా ఆశించగలమని అన్నాడు. ఆ వెంటనే 'నేను ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్లలు పుట్టరు కదా. ముందు సంకల్పం దృఢంగా ఉండాలి' అని సంబంధం లేని విషయాన్ని క్రికెట్ బోర్డుతో పోల్చుతూ ముడి పెట్టాడు రజాక్.
మాజీల సమక్షంలోనే..
ఈ చిట్‌చాట్ కార్యక్రమంలో మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్, యూనిస్ ఖాన్, సయీద్ అజ్మల్, షోయబ్ మాలిక్, కమ్రాన్ అక్మల్ కూడా ఉన్నారు. అయితే రజాక్ చేసిన కామెంట్స్‌కు పక్కనే కూర్చున్న అఫ్రిది చప్పట్లు కొడుతూ నవ్వడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు క్రికెటర్‌ను ట్రోలింగ్ సైతం చేస్తున్నారు.
-
A new low of Abdul Razzaq everyday😒pic.twitter.com/FlK4OXjPJ8
— Anushay✨|| koi farq nahi parta (@anushuholic) November 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">A new low of Abdul Razzaq everyday😒pic.twitter.com/FlK4OXjPJ8
— Anushay✨|| koi farq nahi parta (@anushuholic) November 13, 2023A new low of Abdul Razzaq everyday😒pic.twitter.com/FlK4OXjPJ8
— Anushay✨|| koi farq nahi parta (@anushuholic) November 13, 2023
'థర్డ్‌క్లాస్ స్టేట్‌మెంట్ ఇవ్వడం దారుణం'
రజాక్ చేసి ఈ వ్యాఖ్యలపై నెటిజెన్లు ఫైర్ అయ్యారు. ఓ యూజర్ స్పందిస్తూ.. 'ఇలా చెప్పడానికి సిగ్గుపడాలి. రోజు రోజుకీ నీ స్థాయి దిగజారుతోంది.' అని అన్నాడు. 'అద్భుతమైన క్రికెటర్ అయి ఉండి ఇలాంటి థర్డ్‌క్లాస్ స్టేట్‌మెంట్ ఇవ్వడం దారుణం. ఆ పక్కన షాహిద్ అఫ్రిది సిగ్గులేకుండా నవ్వడం.. ఇదీ వారి మీడియా పరిస్థితి. మహిళలకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా?' అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు. 'క్రికెట్‌కు మినహా.. రజాక్ పరిస్థితి ఏంటంటే.. రైడింగ్ చేయడం రాని వ్యక్తి బండిని నడిపినట్లు ఉంటుంది. ఆ స్టేజ్ మీదున్న వారు క్రికెటర్లు కాకపోయుంటే.. కనీసం మాట్లాడటానికి వేదిక కూడా ఉండదు' మరో యూజర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. 'ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం వల్ల సోషల్ మీడియాలో పేరు వస్తుందని రజాక్ భావించి ఉన్నట్లున్నాడు. మీ దేశ ప్రజలకూ నువ్వు ఆదర్శంగా నిలవలేవు రజాక్' అంటూ తీవ్రంగా స్పందించారు సోషల్ మీడియా యూజర్స్.
బ్యాటర్ల జోరా? వికెట్ల హోరా? సెమీస్ జరిగే వేదికలు ఎవరికి అనుకూలం?
రూ2వేల టికెట్ రెండున్నర లక్షలకు- సెమీస్ క్రేజ్‌ను క్యాష్ చేసుకుందామని అడ్డంగా దొరికి!