ETV Bharat / sports

'వీడ్కోలు విషయంలో ఏబీ గత నిర్ణయమే ఫైనల్' - క్రికెట్ దక్షిణాఫ్రికా

రిటైర్మెంట్ విషయంలో ఏబీ డివిలియర్స్​ నిర్ణయం మారబోదని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. గతంలో అతడు తీసుకున్న నిర్ణయమే చివరిదని తేల్చి చెప్పింది.

AB de Villiers, former south africa cricketer
ఏబీ డివిలియర్స్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్
author img

By

Published : May 18, 2021, 10:31 PM IST

మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్​ తిరిగి క్రికెట్​లోకి పునరాగమనం చేస్తాడంటూ వస్తున్న ఊహాగానాలపై దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు స్పష్టతనిచ్చింది. రిటైర్మెంట్​ విషయంలో అతడి నిర్ణయం మారదని తేల్చి చెప్పింది. వీడ్కోలు అంశంపై తమతో కూడా మాట్లాడాడని వెల్లడించింది. ఈ ఏడాది భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్​కు ముందు ఏబీ.. తిరిగి జట్టులోకి వస్తాడని కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. బోర్డు ఇలా పైవ్యాఖ్యలు చేసింది.

వెస్టిండీస్​తో రెండు టెస్టులు, 5 టీ20ల కోసం జట్టును ప్రకటించిన అనంతరం దక్షిణాఫ్రికా బోర్డు ఈ ప్రకటన చేసింది. మే 2018లో డివిలియర్స్​ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు ప్రకటించాడు. ప్రోటీస్​ జట్టు తరఫున 114 టెస్టులతో పాటు 228 వన్డేలు, 78 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్​ 14వ సీజన్​లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుకు ఆడిన డివిలియర్స్.. ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. చెన్నై వేదికగా జరిగిన ఓ మ్యాచ్​లో ఆర్సీబీని గెలిపించిన అనంతరం తిరిగి క్రికెట్​ పునరాగమనం చేయాలనుకుంటున్నట్లు అభిప్రాయపడ్డాడు. సౌతాఫ్రికా కోచ్​ బౌచర్​తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాడు ఏబీ.

ఇదీ చదవండి: ఆ ఆస్ట్రేలియా ప్లేయర్ల ఖర్చులన్నీ బీసీసీఐవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.