RCB Hall of Fame: ఐపీఎల్ ప్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హాల్ ఆఫ్ ఫేమ్‌ను ప్రకటించింది. తొలి రెండు స్థానాలను ఆ జట్టుకు విశేష సేవలందించిన దిగ్గజ క్రికెటర్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌కు కేటాయించింది. సోమవారం సాయంత్రం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ వీరి పేర్లను ప్రకటించాడు. గేల్, డివిలియర్స్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి వీరిద్దరు వర్చువల్‌గా హాజరయ్యారు.
-
Introducing the #RCB Hall of Fame: Match winners, Legends, Superstars, Heroes - you can go on and on about @ABdeVilliers17 and @henrygayle, two individuals who are responsible for taking IPL to where it is today. #PlayBold #WeAreChallengers #IPL2022 #ನಮ್ಮRCB #RCBHallOfFame pic.twitter.com/r7VUkxqEzP
— Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Introducing the #RCB Hall of Fame: Match winners, Legends, Superstars, Heroes - you can go on and on about @ABdeVilliers17 and @henrygayle, two individuals who are responsible for taking IPL to where it is today. #PlayBold #WeAreChallengers #IPL2022 #ನಮ್ಮRCB #RCBHallOfFame pic.twitter.com/r7VUkxqEzP
— Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022Introducing the #RCB Hall of Fame: Match winners, Legends, Superstars, Heroes - you can go on and on about @ABdeVilliers17 and @henrygayle, two individuals who are responsible for taking IPL to where it is today. #PlayBold #WeAreChallengers #IPL2022 #ನಮ್ಮRCB #RCBHallOfFame pic.twitter.com/r7VUkxqEzP
— Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022
Royal Challengers Bangalore: విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ఏబీ, గేల్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇద్దరు లెజెండరీ బ్యాటర్లు చాలా ఏళ్ల పాటు బెంగళూరుకు విశేష సేవలందించారని కొనియాడాడు. విధ్వంసకర ఆట తీరుతో ఐపీఎల్ రూపు రేఖలనే మార్చిన ఘనత ఏబీ, గేల్‌కు దక్కుతుందని పేర్కొన్నాడు. ఐపీఎల్‌పై వీరి ప్రభావం ఎప్పటికీ ఉంటుందన్నాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లు తనకు ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చాడు.
AB de villiers: ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించడం తనకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు డివిలియర్స్ ఆనందం వ్యక్తం చేశాడు. వర్చువల్‌గా మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఆర్సీబీ జట్టు సభ్యులతో అనుబంధాన్ని ఎప్పటికీ మరచిపోలేనని పేర్కొన్నాడు. మాజీ సారథి కోహ్లీకి ధన్యవాదాలు తెలిపాడు. ఆర్సీబీతో ప్రయాణం తన జీవితంలో గొప్ప విషయమని చెప్పాడు. ఈ జట్టు తనకు కుటుంబంతో సమానమన్నాడు.
క్రిస్ గేల్ కూడా ఆర్సీబీ ప్రాంఛైజీకి కృతజ్ఞతలు చెప్పాడు. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడం తనకు ఎంతో ప్రత్యేకమన్నాడు. ఈ జట్టు తన హృదయానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుందని, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
మిస్టర్ 360 డిగ్రీస్‌గా పేరున్న ఏబీ డివిలియర్స్ ఆర్సీబీ తరఫున 2011-2021 వరకు 157 మ్యాచ్‌లు ఆడాడు. 158.33 స్ట్రైక్ రేట్‌తో 4,522 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, 37 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 133 నాటౌట్. యూనివర్సల్ బాస్‌గా పిలిచే క్రిస్ గేల్ ఆర్సీబీ తరఫున 2011-2017 మధ్య 91 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. 154.40 స్ట్రైక్ రేట్‌తో 3,420 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 175 నాటౌట్ అత్యధిక స్కోరు.
వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గేల్, డివిలియర్స్‌కు ప్రత్యేక మొమెంటోలు ఇచ్చి సన్మానించనున్నట్లు ఆర్సీబీ తెలిపింది.
ఇదీ చదవండి: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గబ్బర్.. ప్రముఖ బాలీవుడ్ బ్యానర్లో!