ETV Bharat / sports

ఫించ్​ దంపతులకు పండంటి ఆడబిడ్డ - aaron finch father

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్​ అరోన్​ ఫించ్(Aaron finch) ​ తండ్రయ్యాడు. తన భార్య ఆడపిల్లకు జన్మనిచ్చినట్లు తెలుపుతూ ఇన్​స్టా వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అలాగే ఆ పాపకు పేరు కూడా పెట్టాడు.

Aaron Finch
అరోన్​ ఫించ్​
author img

By

Published : Sep 8, 2021, 2:03 PM IST

Updated : Sep 8, 2021, 2:17 PM IST

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల సారథి అరోన్​ ఫించ్(Aaron finch) ​ భార్య అమీ​ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్తను తెలియజేస్తూ ఇన్​స్టాలో పాప ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్​ చేశాడీ ఆసీస్ క్రికెటర్. పాపకు ఎస్తర్​ కేట్​ ఫించ్​గా ​నామకరణం చేసినట్లు తెలిపాడు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించాడు.

"ఎస్తర్​ కేట్ ఫించ్​ కొత్త ప్రపంచానికి స్వాగతం. మా బుజ్జి యువరాణి నిన్న సాయంత్రం 4.58 గంటలకు 3.54కేజీల బరువుతో జన్మించింది. ఇద్దరి ఆరోగ్యం బాగానే ఉంది" అంటూ ఫించ్​ వ్యాఖ్య రాసుకొచ్చాడు.

Aaron Finch
అరోన్​ ఫించ్​ దంపతులు

కెరీర్​లో ఫించ్​ ఐదు టెస్టులు(278 పరుగులు), 132 వన్డేలు(5232), 76 టీ20(2473) 87 ఐపీఎల్​ మ్యాచ్​లు(2005) ఆడాడు. గత సీజన్​లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన ఫించ్​ను ఈ సీజన్​లో ఫ్రాంచైజీ తీసుకోలేదు. దీంతో ఈ సారి మెగాలీగ్​ను అతను ఆడలేదు.

Aaron Finch
అరోన్​ ఫించ్​ కూతురు

ఇదీ చూడండి: సిక్సర్ల మోతతో ఫించ్​ అరుదైన రికార్డ్

Last Updated : Sep 8, 2021, 2:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.