ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final) టీమ్‌ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా(Akash Chopra) అభిప్రాయపడ్డాడు. బ్యాటుతోనూ రాణించగల రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాకు చోటివ్వాలని సూచించాడు.
"నా ఉద్దేశం ప్రకారం వారిద్దరూ (జడ్డూ, యాష్) ఆడాలి. ఎందుకంటే ప్రత్యర్థి జట్టు న్యూజిలాండ్. అది ఆసియా జట్టు కాదు కాబట్టి స్పిన్‌ను మెరుగ్గా ఆడలేదు. అందుకే ఐదుగురు బౌలర్లలో జడ్డూ, అశ్విన్‌కు చోటివ్వాలి. ఇంగ్లాండ్ పరిస్థితుల్లో వారిద్దరూ రాణించగలరు. ఇంగ్లిష్ పరిస్థితులు స్పిన్నర్లకు ఎక్కువ అనుకూలించవని చాలామంది భావిస్తారు. కానీ ఏకరూప బౌలింగ్ దాడి ఉన్నప్పుడు బ్యాటింగ్ సులభంగా చేయడం మనం గమనించాం."
-ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత,మాజీ క్రికెటర్.
జూన్ 18న సౌథాంప్టన్ వేదికగా టీమ్‌ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్లో తలపడనున్నాయి. న్యూజిలాండ్ ఇప్పటికే ఇంగ్లాండ్‌తో ఓ టెస్టు ఆడింది. మరో టెస్టుకు సిద్ధమవుతోంది. మరోవైపు కోహ్లీసేనకు సాధన చేస్తోంది. ఇక టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అశ్విన్(Ravichandran Aswin) నిలిచాడు. 13 మ్యాచుల్లో 67 వికెట్లు తీశాడు. జడ్డూ(Jadeja) 10 మ్యాచుల్లో 28 వికెట్లు తీసి బ్యాటుతోనూ విలువైన పరుగులు చేశాడు.
ఇదీ చూడండి Rashid Khan: 'మళ్లీ ఆ బాధ్యతలు వద్దు'