ETV Bharat / sports

Team India:' డబ్ల్యూటీసీ కన్నా ఆ గెలుపే ముఖ్యం'

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్(WTC Final)​ కన్నా ఇంగ్లాండ్​ సిరీస్​పైనే టీమ్​ఇండియా​ గెలవాలని తాను భావిస్తున్నట్లు చెప్పాడు వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా(Akash Chopra). అందుకు గల కారణాన్ని వివరించాడు.

Aakash Chopra
ఆకాశ్‌ చోప్రా
author img

By

Published : Jun 6, 2021, 5:31 PM IST

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్(WTC Final)​ లేదా ఇంగ్లాండ్‌ సిరీస్‌.. ఈ రెండింటిలో టీమ్‌ఇండియా ఎందులో గెలవాలని కోరుకుంటారు? అని అడిగితే ఇంగ్లాండ్‌ సిరీస్‌కే ఓటేస్తానని మాజీ ఓపెనర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా(Akash Chopra) అన్నాడు. జూన్‌ 18 నుంచి టీమ్‌ఇండియా.. న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో తలపడనుండగా, ఆగస్టులో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ క్రమంలోనే చోప్రా తన యూట్యూబ్‌ ఛానల్లో ఓ వీడియో పంచుకున్నాడు.

'టీమ్‌ఇండియా(TeamIndia) టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలవాలని కోరుకుంటారా? లేక ఇంగ్లాండ్‌ సిరీస్‌ గెలవాలని అనుకుంటారా?'’ అని ఓ అభిమాని తనను ప్రశ్నించాడని చోప్రా పేర్కొన్నాడు. అది తనకు కష్టమైన ప్రశ్నే అయినా తాను మాత్రం ఇంగ్లాండ్‌ సిరీస్‌కే ఓటేస్తానన్నాడు.

''ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. ఓవైపు చూస్తే ఇది ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌. ఐసీసీ ట్రోఫీల్లో అతిపెద్ద ఈవెంట్‌. దీన్ని తొలిసారి నిర్వహిస్తున్నారు కాబట్టి.. కచ్చితంగా ఈ మ్యాచ్‌లో గెలుపొంది టీమ్‌ఇండియా ట్రోఫీ కైవసం చేసుకొని ప్రపంచంలోనే మేటి జట్టుగా ఎదగాలని ఉంటుంది. అయితే, నేను చేదు గుళికనే మింగాలనుకుంటున్నా. ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓటమిపాలైనా ఫర్వాలేదు. ఎందుకంటే మన జట్టు ఇప్పుడు బలంగా ఉంది. ఒక్క మ్యాచ్‌ ఓడినంత మాత్రాన పోయేదేంలేదు. ఇది నంబర్‌ వన్‌ టీమ్‌. పాయింట్ల పట్టికతో పాటు గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నా ముందు ఏ ట్రోఫీ గెలవాలని అడిగితే.. ఇంగ్లాండ్‌ సిరీస్‌కే మొగ్గు చూపుతా. అది ఐదు టెస్టుల సిరీస్‌. ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ గెలుపొంది చాలా కాలమైంది. 2007లో చివరిసారి ద్రవిడ్‌ నేతృత్వంలో టీమ్‌ఇండియా అక్కడ సిరీస్‌ సాధించింది. అప్పటి నుంచి మళ్లీ అక్కడ గెలవలేదు.''

-ఆకాశ్‌ చోప్రా,వ్యాఖ్యాత

భారత జట్టు.. ప్రస్తుతం సౌథాంప్టన్‌లో క్వారంటైన్​ పూర్తిచేసుకుని సాధన చేస్తోంది. జూన్‌ 18-22వరకు న్యూజిలాండ్‌తో డబ్ల్యూటీసీ ఫైనల్లో(WTC Final) తలపడుతుంది. ఆ తర్వాత ఆగస్టు 4- సెప్టెంబర్​ 14 మధ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసు ఆడుతుంది.

ఇదీ చూడండి Kohli x Williamson: 'పోటీ కాదు.. ముందుకు నడిపించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.