టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇష్టమైన కారు లంబోర్గిని(Kohli Lamborghini) గల్లార్డో స్పైడర్! కానీ, ఇప్పుడీ కారును అమ్మకానికి పెట్టాడు. ఈ ఫారెన్ కారును 2015లో కోహ్లీ కొనుగోలు చేశాడు. మార్కెట్లో ప్రస్తుతం రూ.1.35 కోట్ల ధర పలుకుతుంది. 4 సెకన్లలో 0 నుంచి 100 కి.మీ. వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. అయితే ఈ కారును వాడిన కొన్నేళ్లకే విరాట్(Virat Kohli News) దీనిని విక్రయించేశాడు. ఇదే విషయాన్ని కేరళలోని కోచి రాయల్ డ్రైవ్ మార్కెటింగ్ మేనేజర్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఆ లగ్జరీ కారు ఇప్పటివరకు కేవలం 10 వేల కి.మీ. నడిచిందని ఆయన స్పష్టం చేశాడు.
"ఇది 2013 మోడల్ లంబోర్గిని. కోహ్లీ కొద్దికాలమే దీన్ని ఉపయోగించాడు. ఇది 10 వేల కి.మీ. మాత్రమే తిరిగింది. కోల్‌కతాకు చెందిన ప్రీమియం, లగ్జరీ ప్రీఓన్డ్ కార్ డీలర్ నుంచి మేం ఈ కారును కొనుగోలు చేశాం" అని రాయల్ డ్రైవ్ మార్కెటింగ్ మేనేజర్ వెల్లడించాడు.
విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 14వ సీజన్(IPL 14th Season) రెండోదశ కోసం యూఏఈలో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లీ.. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో(RCB Vs KKR 2021) తలపడనున్నాడు. ఇటీవలే టీమ్ఇండియా టీ20 జట్టు కెప్టెన్సీని వదులుకున్న కోహ్లీ.. ఈ సీజన్ తర్వాత ఐపీఎల్ నాయకత్వ బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించాడు.
ఇదీ చూడండి.. Rohit Sharma IPL: రోహిత్ శర్మ తర్వాత మ్యాచ్‌లో ఉంటాడా?