ETV Bharat / sports

ఆరు బాల్స్​ - ఆరు వికెట్లు - క్రికెట్​ హిస్టరీలో ఇదే తొలి సారి! - ఆస్ట్రేలియా క్రికెట్​ క్లబ్​లో అరుదైన ఫీట్

6 balls 6 wickets : సాధారణంగా బౌలర్లు బరిలోకి దిగితే వీలైనన్నీ వికెట్లను తమ ఖాతాలోకి వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. తమకున్న పరిధిలో బౌలింగ్​ చేసి ఓవర్​కు ఒకటో లేదా రెండు వికెట్లు తీస్తుంటారు. అయితే తాజాగా ఓ బౌలర్​ మాత్రం ఆరు బాల్స్​కు ఆరు వికెట్లు తీసి చరిత్రకెక్కాడు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

6 balls 6 wickets
6 balls 6 wickets
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 6:47 AM IST

6 balls 6 wickets : క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేం. ఒక్కోసారి గెలుస్తుందనుకున్న జట్టు ఓటమిపాలైతే.. మరోసారి ఇక ఓడిపోతుంది అనుకున్నజట్టు అనుహ్యంగా గెలిచి అందరినీ అబ్బురపరుస్తుంది. ఆస్ట్రేలియాలోని ఓ క్లబ్‌ క్రికెట్‌లో జరిగిన మ్యాచ్​లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇక ఓటమి ఖాయమనుకున్న సమయంలో ఓ బౌలర్‌ ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు పడగొట్టి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

అసలేం జరిగిందంటే ?
గోల్డ్ కోస్ట్ ప్రీమియర్ లీగ్ డివిజన్ 3 పోటీల్లో ఈ అరుదైన ఫీట్ జరిగింది. సర్ఫర్స్ ప్యారడైజ్‌ జట్టుపై ముద్గీరాబా నెరంగ్ & డిస్ట్రిక్ట్స్ టీమ్‌ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. 40 ఓవర్లలో 178 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన సర్ఫర్స్ ప్యారడైజ్‌ జట్టు 39 ఓవర్లకు 174/4 స్కోరుతో నిలిచింది.

ఇక ఆరు బంతుల్లో ఐదు పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. సరిగ్గా అదే సమయంలో ముద్గీరాబా నెరంగ్ కెప్టెన్ గారెత్‌ మోర్గాన్ రంగంలోకి దిగాడు. చివరి ఓవర్‌లో బాల్​ పట్టి ఒక్క పరుగూ ఇవ్వకుండా ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఎవరూ ఊహించనివిధంగా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ దెబ్బతో సర్ఫర్స్ ప్యారడైజ్‌ జట్టు ఆలౌట్‌ కాగా.. ముద్గీరాబా నెరంగ్ జట్టు నాలుగు రన్స్‌ తేడాతో విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ఔటైన వారిలో మొదటి నలుగురు బ్యాటర్లు మాత్రం క్యాచ్‌ ఔట్‌ కాగా.. మిగతా ఇద్దరు క్లీన్‌బౌల్డ్ అయ్యారు. ఈ మ్యాచ్‌లో గారెత్.. ఏడు ఓవర్లు వేసి 7/16 గణాంకాలు నమోదు చేశాడు. ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు పడగొట్టడానికి ముందు సర్ఫర్స్ ప్యారడైజ్ ఓపెనర్ జేక్ గార్లాండ్‌ని ఔట్‌ చేశాడు. అయితే ఈ మ్యాచ్​లో గారెత్‌.. బౌలింగ్​లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ రాణించాడు. 39 పరుగులు చేసి జట్టులో టాప్‌ స్కోరర్‌గానూ నిలిచాడు.

అయితే ఈ అరుదైన ఫీట్​ను పోలిన ఘటనలు క్రికెట్​ చరిత్రలో జరిగాయట. పలు నివేదికల్లో వెలువడిన సమాచారం ప్రకారం.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఇదివరకు కొంతమంది ఒకే ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టారు. 2011లో వెల్లింగ్టన్‌పై ఒటాగో తరఫున న్యూజిలాండ్‌కు చెందిన నీల్ వాగ్నర్, 2013లో అభానీ లిమిటెడ్‌పై యూసీబీ- బీసీబీ XI తరఫున బంగ్లాదేశ్ అల్ అమీన్ హోస్సేన్ ఒకే ఓవర్లో ఐదు వికెట్లు తీశారు. మరోవైపు భారత్‌ విషయానికొస్తే.. కర్ణాటక తరఫున 2019లో అభిమన్యు మిథున్‌ అనే ప్లేయర్​.. హరియాణా జట్టుపై ఈ ఘనత సాధించాడు.

Ind vs Pak Top 5 Wicket Takers : ఇండోపాక్ మ్యాచ్​ల్లో అత్యధిక వికెట్ల వీరులు వీళ్లే.. లిస్ట్​లో కుంబ్లే ప్లేస్ ఎంతంటే

Wicket Keeper Highest Score vs Pakistan : 18 ఏళ్ల ధోనీ రికార్డును బద్దలుకొట్టిన అఫ్గాన్ బ్యాటర్.. పాక్​పై వికెట్ కీపర్ల టాప్ 5 స్కోర్లివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.