క్వాలిఫయర్స్, ప్రాక్టీస్ మ్యాచ్‌లతో(t20 world cup qualifiers 2021) ఇప్పటికే క్రికెట్ ప్రేమికులకు బోలెడంత మజా పంచింది టీ20 ప్రపంచకప్(T20 worldcup 2021 schedule). ఇప్పుడు అందులో భాగంగా సూపర్-12 పోటీలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత జరగనున్న ఈ మెగాటోర్నీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి గతేడాది జరగాల్సిన ఈ టోర్నీ కరోనా వల్ల ఈ ఏడాదికి వాయిదా పడింది. ప్రస్తుతం బీసీసీఐ ఆధ్వర్యంలో యూఏఈ, ఒమన్ వేదికగా(T20 worldcup venues) జరగనున్న ఈ మెగాటోర్నీ కొంతమంది ఆటగాళ్లకు మొదటి ప్రపంచకప్ కాగా మరికొంతమంది తొలి వరల్డ్‌కప్(2007) నుంచి ఆడుతూ ప్రస్తుతం ప్రపంచకప్‌లోనూ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిలో టీమ్ఇండియనా నుంచి రోహిత్ శర్మ ఒక్కడే ఉండటం విశేషం. ఇంకా క్రిస్‌గేల్, బ్రావో సహా పలువురు ఆటగాళ్లు ఉన్నారు. వారెవరో చూద్దాం..
రెండో స్థానంలో
యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్(chris gayle t20 world cup 2021) అన్ని వరల్డ్‌కప్‌ల్లోనూ ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు ఈ మెగాటోర్నీలో 920 పరుగులు(28 మ్యాచ్‌ల్లో) చేసిన ఈ విధ్వంసక వీరుడు.. టీ20ప్రపంచకప్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు.
ఒకేఒక్కడు
రోహిత్‌శర్మ(Rohith sharma t20 world cup 2021) .. టీమ్ఇండియా నుంచి ఈ ఘనత సాధించిన ఒకేఒక్కడు. ఇప్పటివరకు ఆన్ని ప్రపంచకప్‌లోనూ ఆడిన హిట్‌మ్యాన్ 673 రన్స్ చేశాడు. అతడు.. తొలి టీ20 ప్రపంచకప్(2007) ద్వారానే టీ20 అరంగేట్రం చేశాడు. ఈ సమయానికి సారథి కోహ్లీ అండర్-19 ఆడుతున్నాడు.
అటు బ్యాట్‌తో ఇటు బంతితో
బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హాసన్(Shakid al hassan t20 world cup 2021).. ఇప్పటివరకు అన్ని ప్రపంచకప్‌ల్లోనూ ఆడిన ఇతడు అటు బ్యాట్‌తోనూ ఇటు బంతితోనూ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. 567 పరగులు సహా 30 వికెట్లు తీశాడు. 2016లో ఏకంగా పది వికెట్లు తీసి అందరీ దృష్టిని ఆకర్షించాడు.
ఎలా ఆడుతాడో
బంగ్లాదేశ్ జట్టు మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్(Mushfaqar rahim t20 career).. టీ20ల్లో అంతగా రికార్డులను అందుకోనప్పటికీ.. తన నాయకత్వ లక్షణాలు జట్టుకు బాగా తోడ్పడే అవకాశాలున్నాయి. 2007లో వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఓ మ్యాచ్‌లో టీమ్ఇండియాను ఓడించడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు. మరి ఈసారి ఇతడు ఎలా రాణిస్తాడో చూడాలి.
విజయంలో కీలకంగా
విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్(dwayne bravo t20 world cup) బ్రావో కూడా ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. ఇప్పటివరకు అతడు పొట్టి ప్రపంచకప్‌ల్లో 504 పరుగులతో పాటు 25 వికెట్లు తీశాడు. 2009 ప్రపంచకప్‌లో 154పరుగులు సహా 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 2016వ సీజన్లోనూ తొమ్మిది వికెట్లు పడగొట్టి.. ఆ ఏడాది తమ జట్టు టైటిల్ అందుకోవడంలో కీలకంగా వ్యవహరించాడు.
ఇదీ చూడండి: T20 world cup 2021: కోహ్లీ వర్సెస్ బాబర్.. రికార్డులివే..