ETV Bharat / sports

భారత్​లో 3 ఐసీసీ టోర్నమెంట్​లు- పాక్​లో ఛాంపియన్స్​ ట్రోఫీ - టీమ్​ఇండియా

ICC tournaments
టీ20 ప్రపంచకప్
author img

By

Published : Nov 16, 2021, 5:44 PM IST

Updated : Nov 16, 2021, 9:03 PM IST

17:36 November 16

వచ్చే పదేళ్లలో భారత్​లో 3 ఐసీసీ టోర్నమెంట్​లు

ICC tournaments
ఐసీసీ టోర్నీల వివరాలు

వచ్చే పదేళ్లలో భారత్​లో 3 ఐసీసీ టోర్నమెంట్​లు జరగనున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి.. రాబోయే దశాబ్ద కాలానికి సంబంధించిన 8 కొత్త టోర్నీల వివరాలను మంగళవారం (ICC News) ప్రకటించింది. 2026 టీ20 ప్రపంచకప్​ (శ్రీలంకతో సంయుక్తంగా)​, 2031 వన్డే ప్రపంచకప్​ (బంగ్లాదేశ్​తో సంయుక్తంగా), 2029 ఛాంపియన్స్​ ట్రోఫీకి భారత్​ ఆతిథ్యమివ్వనుంది.

ఎట్టకేలకు పాక్​లో..

ఇక దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్​లో (Pakistan Cricket News) అతిపెద్ద క్రికెట్​ ఈవెంట్ జరగనుంది. 2025 ఛాంపియన్స్​ ట్రోఫీకి (2025 Champions Trophy).. పాక్ ఆతిథ్యమివ్వనుంది. పాకిస్థాన్​ చివరిసారిగా భారత్​, శ్రీలంకతో సంయుక్తంగా 1996 ప్రపంచకప్​ను నిర్వహించింది. 2009లో లాహోర్​లో  శ్రీలంక జట్టు ఉన్న బస్సుపై దాడి జరిగిన నాటి నుంచి ఆ దేశంలో పెద్దగా అంతర్జాతీయ మ్యాచ్​లు జరగలేదు.

పాక్​లో సాధ్యమేనా?

చివరి ఛాంపియన్స్​ ట్రోఫీ (ICC Champions Trophy) యూకేలో 2017లో జరిగింది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ ఐసీసీ దానిని నిర్వహించనుంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్​ జట్లు ఇటీవలే పాకిస్థాన్ పర్యటనను రద్దు చేసుకున్నాయి. మరి ఛాంపియన్స్​ ట్రోఫీ కోసం ఎన్ని దేశాలు.. పాక్​ గడ్డపై అడుగుపెట్టేందుకు సుముఖంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ టోర్నీని పాక్​.. యూఏఈలో నిర్వహించే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.

14 దేశాల్లో..

2023 నుంచి 2031 వరకు.. (ICC Events List) రెండు వన్డే ప్రపంచకప్​లు, నాలుగు టీ20 ప్రపంచకప్​లు, రెండు ఛాంపియన్స్​ ట్రోఫీలు జరగనున్నాయి. వీటికి 14 ఐసీసీ సభ్యదేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్​ అమెరికా, వెస్టిండీస్​ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఉత్తర అమెరికాలో జరగబోయే తొలి గ్లోబల్ ఈవెంట్​ ఇదే.

పూర్తి షెడ్యూల్ ఇదే..

టోర్నమెంట్ఆతిథ్య దేశం
2024 టీ20 ప్రపంచకప్అమెరికా, వెస్టిండీస్​ సంయుక్తంగా
2025 ఛాంపియన్స్​ ట్రోఫీపాకిస్థాన్
2026 టీ20 ప్రపంచకప్​భారత్, శ్రీలంక సంయుక్తంగా
2027 వన్డే ప్రపంచకప్​దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా
2028 టీ20 ప్రపంచకప్ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా
2029 ఛాంపియన్స్​ ట్రోఫీభారత్
2030 టీ20 ప్రపంచకప్ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్ సంయుక్తంగా
2031 వన్డే ప్రపంచకప్భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా

ఇదీ చూడండి: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ వేదికలు ఖరారు

Last Updated : Nov 16, 2021, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.