9.30
ఐపీఎల్ వేలం అట్టహాసంగా ముగిసింది. హోరా హోరీగా జరిగిన ఈ మినీ వేలంలో 72 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. అందుకోసం రూ. 230.45 కోట్లను వెచ్చించాయి. ఓవర్సీస్‌కు సంబంధించి 30 స్లాట్‌లు కూడా పూర్తి కావడం విశేషం.
7.35
- ఆస్ట్రేలియా ప్లేయర్ స్పెన్సర్ జాన్సన్‌ను గుజరాత్ జట్టు రూ. 10 కోట్లకు సొంతం చేసుకుంది.
- ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ విల్లేను లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ. 2 కోట్లు దక్కించుకుంది.
7.25
- ఆసీస్ ప్లేయర్ అస్టన్ అగర్‌ను రూ. కోటికి లఖ్‌నవూ జట్టు సొంతం చేసుకుంది.
- రుథర్‌ఫోర్డ్ రూ. 1.5 కోట్లకు కోల్‌కతా ఎంపిక చేసుకుంది.
- టామ్ కరన్‌ను బెంగళూరు రూ. 1.5 కోట్లకు దక్కించుకుంది.
6.34
- మణిమారన్ సిద్ధార్థ్‌ను ₹ 2.40 కోట్లకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.
- శ్రేయాస్ గోపాల్‌ను ముంబయి ఫ్రాంచైజీ ₹ 20 లక్షలకు తీసుకుంది.
- గుజరాత్ జట్టు ₹ 20 లక్షలకు మానవ్ సుతార్‌ను కొనుగోలు చేసుకుంది.
6.25
- సుశాంత్ మిశ్రాను రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్.
- ఆకాశ్ సింగ్‌ని రూ.20 లక్షలకు సన్‌రైజర్స్ తీసుకుంది.
- కార్తిక్ త్యాగీని రూ.60 లక్షలకు గుజరాత్ టైటాన్స్ దక్కించుకుంది.
- రక్షిక్ దార్‌ను రూ.20 లక్షలకు దిల్లీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.
6:19
- భారత అన్‌క్యాప్‌డ్ పేసర్ యశ్ దయాల్‌ను రూ.5 కోట్లకు ఆర్సీబీ ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది.
6:15
- ఇండియా అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ కుమార్ కుశాగ్రాను దిల్లీ క్యాపిటల్స్ రూ.7.20 కోట్లకు సొంతం చేసుకుంది.
6:11
- ఇంగ్లాండ్‌కు చెందిన టామ్ కోహ్లర్- కాడ్మోర్‌ని కనీస ధర రూ. 40 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
- భారత అన్‌క్యాప్‌డ్ ప్లేయర్ రికీ భుయ్‌ని రూ.20 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది.
5.43
షారుక్ ఖాన్ - గుజరాత్ టైటాన్స్- రూ.7.4 కోట్లు
రమన్‌దీప్ సింగ్- కోల్కతా నైట్ రైడర్స్- రూ. 20 లక్షలు
5:30
- సమీర్ రిజ్వీ - ₹ 8.4 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
- అంగ్క్రిష్ రఘువంశీ - ₹ 20 లక్షలు (కోల్కతా నైట్ రైడర్స్)
- శుభమ్ దూబే (బ్యాటర్, భారత్)-రూ. 5.80 కోట్లు- రాజస్థాన్ రాయల్స్
- 5.20 PM
- దిల్షాన్ మధుషంక (బౌలర్, శ్రీలంక)- రూ. 4.60 కోట్లు- ముంబయి ఇండియన్స్
- జయదేవ్ ఉనాద్కత్ (బౌలర్, భారత్)- రూ. 1.60 కోట్లు- సన్‌రైజర్స్
- మిచెల్ స్టార్క్ (బౌలర్, ఆస్ట్రేలియా)- రూ. కోట్లు- 24.75 - కోల్కతా నైట్‌రైడర్స్
- శివమ్ మావి (బౌలర్, భారత్)- రూ. 6.40- లఖ్‌నవూ సూపర్ జెయింట్స్
- 3.40PM
- ఉమేశ్ యాదవ్ (బౌలర్, భారత్)- రూ. 5.8 కోట్లు- గుజరాత్ టైటాన్స్
- అల్జారీ జోసెఫ్ (బౌలర్, వెస్టిండీస్)- రూ. 11.50 కోట్లు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- 3.15 PM
- ట్రిస్టాన్ స్టబ్స్ (వికెట్ కీపర్, సౌతాఫ్రికా)- రూ. 50 లక్షలు- దిల్లీ క్యాపిటల్స్
- కేఎస్ భరత్ (వికెట్ కీపర్, భారత్)- రూ. 50 లక్షలు- కోల్కతా నైట్‌రైడర్స్
- చేతన్ సకారియా (బౌలర్, భారత్)- రూ. 50 లక్షలు- కోల్కతా నైట్‌రైడర్స్
- క్రిస్ వోక్స్ (బౌలర్, ఇంగ్లాండ్)- రూ. 4.2 కోట్లు- పంజాబ్ కింగ్స్
- డారిల్ మిచెల్ (బ్యాటర్, న్యూజిలాండ్)- రూ. 14 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
- 2.40PM
- హర్షల్ పటేల్ (బౌలర్, భారత్)- రూ. 11.75 కోట్లు- పంజాబ్ కింగ్స్
- గెరాల్డ్ కోట్జీ (బౌలర్, సౌతాఫ్రికా)- రూ. 5 కోట్లు- ముంబయి ఇండియన్స్
- ప్యాట్ కమిన్స్ (బౌలర్, ఆస్ట్రేలియా)- రూ. 20.50 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్
- అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆల్‌రౌండర్, అఫ్గానిస్థాన్)- రూ. 50 లక్షలు- గుజరాత్ టైటాన్స్
- శార్దూల్ ఠాకూర్ (ఆల్‌రౌండర్, భారత్)- రూ. 4 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
- రచిన్ రవీంద్ర (బ్యాటర్, న్యూజిలాండ్)- రూ. 1.8 కోట్లు- చెన్నై సూపర్ కింగ్స్
- 2.00PM
- వానిందు హసరంగ (స్పిన్నర్, శ్రీలంక)- రూ. 1.5 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్
- 1.45PM
- సెట్ 1 వేలం కంప్లీట్
- రోమన్ పావెల్ (రూ. 7.4 కోట్లు), హెడ్ (రూ. 6.8 కోట్లు), బ్రూక్ (రూ. 4కోట్లు) అమ్ముడయ్యారు.
- ట్రావిస్ హెడ్ (ఆల్‌రౌండర్, ఆస్ట్రేలియా)- రూ. 6.8 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్
- హ్యారీ బ్రూక్ (బ్యాటర్, ఇంగ్లాండ్)- రూ. 4 కోట్లు- దిల్లీ క్యాపిటల్స్
1.25 PM
రాజస్థాన్ రాయల్స్ బోణీ- మొదటి ప్లేయర్‌కు రూ.7.4 కోట్లు : 2024 ఐపీఎల్ మినీ వేలం ప్రారంభమైంది. వెస్టిండీస్ ప్లేయర్ రోమన్ పావెల్‌పై మొదట వేలం నిర్వహించారు. రూ. కోటి కనీస ధర ఉన్న ఈ ఆటగాడిని రాజస్థాన్ రాయల్స్ రూ. 7.4 కోట్ల దక్కిచుకుంది.
11.50 AM
Sunrisers Hyderabad Auction 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 34 కోట్లు ఉన్నాయి. కాగా సన్‌రైజర్స్ జట్టులో 6 స్లాట్‌లు ఖాళీ ఉండగా, అందులో 3 ఫారిన్ ప్లేయర్ స్థానాలు. దీంతో జట్టును బ్యాలెన్స్ చేసేందుకు హైదరాబాద్ యాజమాన్యం న్యూజిలాండ్ యంగ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర, ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్, శ్రీలంక స్పిన్నర్ కోసం పోటీపడే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
11.15 AM
రిషభ్ పంత్ ఈజ్ బ్యాక్ : రోడ్ యాక్సిడెంట్ నుంచి కోలుకుంటున్న టీమ్ఇండియా డాషింగ్ బ్యాటర్ రిషభ్ పంత్ ఈ వేలానికి హాజరయ్యాడు. కాగా ఐపీఎల్ హిస్టరీలోనే ఫ్రాంచైజీతోపాటు వేలంలో పాల్గొననున్న కెప్టెన్‌గా నిలిచాడు పంత్. ఇక ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పంత్, మరో 2-3 నెలల్లో పూర్తి ఫిట్నెస్ సాధిస్తానని ధీమావ్యక్తం చేశాడు.
11.00 AM
2024 IPL Auction Updates : 2024 ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఆక్షన్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఫ్రాంచైజీ యాజమాన్యం ఒక్కొక్కరుగా ఈవెంట్‌కు చేరుకుంటున్నారు. పది ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికతో ప్లేయర్ల వేలంలో పాల్గొననున్నాయి. ఈ వేలంలో 333 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనన్నారు. కాగా 77 స్లాట్లకు గాను మరికొన్ని నిమిషాల్లో వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ ? : టెలివిజన్‌లో అయితే స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్, లైవ్ స్ట్రీమింగ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో సినిమా ఓటీటీలో వీక్షించవచ్చు.
ఎంత వెచ్చించనున్నారు? : పది ఫ్రాంచైజీలు కలిపి ఈ వేలంలో మొత్తం రూ. 262.95 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఇందులో అత్యధికంగా గుజరాత్ టైటాన్స్ వద్ద రూ. 38.15 కోట్లు ఉన్నాయి. అత్యల్పంగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ వద్ద రూ. 13.15 కోట్లు ఉన్నాయి. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ పర్స్ వ్యాల్యూ రూ.34 కోట్లు.