2023 World Cup Warm Up Matches : మరో ఏడు రోజుల్లో 2023 ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు ఒక్కొక్కటిగా భారత్‌కు చేరుకుంటున్నాయి. అయితే మెగా టోర్నీ స్టార్ట్ అయ్యేకంటే ముందు అన్ని దేశాలు ఆయా జట్లతో వార్మప్ మ్యాచ్‌లు ఆడతాయి. ఈ మ్యాచ్‌లు సెప్టెంబర్ 29 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మరి ఆ వార్మప్ మ్యాచ్‌ల్లో ఏయే దేశాలు ఎవరితో, ఎప్పుడు, ఎక్కడ తలపడనున్నాయంటే.
- మ్యాచ్.1 సెప్టెంబర్ 29.. బంగ్లాదేశ్-శ్రీలంక (బర్సపరా స్టేడియం, గువాహటి )
- మ్యాచ్.2 సెప్టెంబర్ 29.. సౌతాఫ్రికా-అఫ్గానిస్థాన్ (గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, తిరువనంతపురం)
- మ్యాచ్.3 సెప్టెంబర్ 29.. న్యూజిలాండ్-పాకిస్థాన్ (ఉప్పల్ స్టేడియం, హైదరాబాద్)
- మ్యాచ్.4 సెప్టెంబర్ 30.. భారత్-ఇంగ్లాండ్ (బర్సపరా స్టేడియం, గువాహటి )
- మ్యాచ్.5 సెప్టెంబర్ 30.. ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ (గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, తిరువనంతపురం)
- మ్యాచ్.6 అక్టోబర్ 02.. న్యూజిలాండ్-సౌతాఫ్రికా (గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, తిరువనంతపురం)
- మ్యాచ్.7 అక్టోబర్ 02.. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ (బర్సపరా స్టేడియం, గువాహటి )
- మ్యాచ్.8 అక్టోబర్ 03.. అఫ్గానిస్థాన్-శ్రీలంక (బర్సపరా స్టేడియం, గువాహటి )
- మ్యాచ్.9 అక్టోబర్ 03.. భారత్-నెదర్లాండ్స్ (గ్రీన్ ఫీల్డ్ స్టేడియం, తిరువనంతపురం)
- మ్యాచ్.10 అక్టోబర్ 03.. పాకిస్థాన్-ఆస్ట్రేలియా (ఉప్పల్ స్టేడియం, హైదరాబాద్)
మ్యాచ్‌లు ప్రారంభమయ్యే సమయం.. అన్ని మ్యాచ్‌లు 50 ఓవర్ల ఫార్మాట్లోనే జరుగుతాయి. ఇక మ్యాచ్‌లన్నీ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమౌతాయి.
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ.. 2023 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లన్నీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదిక డిస్నీ+ హాట్‌స్టార్‌లో లైవ్ వీక్షించవచ్చు. ఇక టెలివిజన్‌లో స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానెల్లో లైవ్ అందుబాటులో ఉంటుంది. ఇక అక్టోబర్ 5న అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో.. ఈ మెగాటోర్నీ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. 2019 రన్నరప్ న్యూజిలాండ్‌తో తలపడనుంది. 46 రోజులపాటు సాగే ఈ టోర్నీ.. నవంబర్ 19న ముగుస్తుంది.
సౌతాఫ్రికా కెప్టెన్ దూరం.. ఈ వార్మప్ మ్యాచ్‌లకు సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవూమా దూరం కానున్నాడు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతడు తిరిగి దక్షిణాఫ్రికా పయనమయ్యాడు. అయితే టోర్నమెంట్‌లోని మ్యాచ్‌లకు మాత్రం బవూమా అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక బవూమా గైర్హాజరీలో.. వార్మప్ మ్యాచ్‌ల్లో స్టార్ బ్యాటర్ మర్క్రమ్ జట్టును నడిపించనున్నాడు. సౌతాఫ్రికా సెప్టెంబర్ 29న అఫ్గానిస్థాన్, అక్టోబర్ 2న న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది.
-
The winners will take home US$4 million while the runners-up get US$2 million 💰
— ICC (@ICC) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Here's everything you need to know about #CWC23 ⬇️https://t.co/ogXQtMouv1
">The winners will take home US$4 million while the runners-up get US$2 million 💰
— ICC (@ICC) September 27, 2023
Here's everything you need to know about #CWC23 ⬇️https://t.co/ogXQtMouv1The winners will take home US$4 million while the runners-up get US$2 million 💰
— ICC (@ICC) September 27, 2023
Here's everything you need to know about #CWC23 ⬇️https://t.co/ogXQtMouv1
Teja Nidamanuru Netherlands : నెదర్లాండ్స్ జట్టులో తెలుగు తేజం.. అతిథిగా వచ్చేస్తున్నాడుగా!