ETV Bharat / sports

2021 Cricket Highlights: భారీ సిక్సర్లు.. స్టన్నింగ్ క్యాచ్​లు! - 2021 భారీ సిక్సర్లు

2021 cricket match highlights: ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా క్రికెట్​లో కొన్ని అద్భుతాలు జరిగాయి. తమ అద్భుతమైన ప్రదర్శనతో క్రికెట్​ మజాను అభిమానులకు అందించారు పలువురు క్రికెటర్లు. భారీ సిక్సర్లు, సూపర్​ క్యాచ్​లు, సూపర్​ స్టంపింగ్స్​లో ఫ్యాన్స్​ను హుషారెత్తించారు. మరి ఈ ఏడాది పూర్తయిపోతున్న నేపథ్యంలో అభిమానులను అలరించిన అద్భుతాలను ఓ సారి నెమరువేసుకుందాం..

2021 క్రికెట్​ హైలైట్స్, 2021 cricket highlights
c
author img

By

Published : Dec 27, 2021, 6:01 PM IST

2021 cricket match highlights: క్రికెట్‌లో మజా రావాలంటే.. బ్యాటర్లు, బౌలర్లు ఒకరిపైఒకరు పైచేయి సాధిస్తూ ఉండాలి. పిచ్‌ ఎలా ఉన్నా సరే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ఆటగాళ్లు ప్రయత్నిస్తుంటారు. బంతిని బౌండరీ అవతలికి కొట్టగానే అభిమానులు, ప్రేక్షకుల నుంచి ఈలలే ఈలలు.. ఎవరైనా ఫీల్డర్‌ అద్భుతమైన క్యాచ్‌ను ఒడిసిపడితే సూపర్‌ అంటూ అభినందనలు.. వికెట్ల వెనుక చిరుతలా కదులుతూ స్టంపింగ్‌ చేస్తే అదరహో అని పొగడ్తలు.. మరి ఈ ఏడాది జరిగిన ఇలాంటి అద్భుతమైన ఫీట్లపై ఓ లుక్కేద్దామా..

భారీ సిక్సర్లు ఇవే..

  • Longest sixes in 2021: అంతర్జాతీయ క్రికెట్‌, దేశవాళీ ఏదైనా సరే క్రికెట్‌ను ఆస్వాదించడం ఒక్కటే సగటు ప్రేక్షకుడికి తెలుసు. అలానే భారీ షాట్లు కొట్టినప్పుడు ఎగిరిగంతేస్తాడు. టెస్టుల్లో చాలా తక్కువగానే సిక్సర్లను బాదడం చూస్తుంటాం. వన్డేలు, టీ20ల్లో మాత్రమే భారీ హిట్టింగ్‌కు దిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో లాంగెస్ట్‌ సిక్సర్లు ఇవే..
  • ఇంగ్లాండ్‌ బ్యాటర్ లివింగ్‌ స్టోన్‌ (122) ఈ ఏడాది భారీ సిక్సర్‌ను బాదాడు. పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ సందర్భంగా టీ20 మ్యాచ్‌లో హారిస్‌ రవుఫ్‌ బౌలింగ్‌లో ఈ ఘనత సాధించాడు.
  • ఇక రెండో భారీ సిక్సర్‌ కూడా లివింగ్ స్టోనే (112) కొట్టడం విశేషం. టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా మీద ఈ ఫీట్ సాధించాడు. కగిసో రబాడ బౌలింగ్‌లో లాంగెస్ట్‌ సిక్సర్‌ను కొట్టాడు.
  • టీ20 ప్రపంచకప్‌లో విండీస్‌ గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. అయితే ఆండ్రూ రస్సెల్‌ (111) ఆసీస్‌ మీద భారీ సిక్స్‌ కొట్టాడు. మిచెల్ స్టార్క్‌ బౌలింగ్‌లో బాదడం విశేషం.
  • ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్ (108) రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్‌ ముస్తాఫిజర్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ కొట్టాడు.
  • ఐపీఎల్‌లోనే కీరన్‌ పొలార్డ్ (105) ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్ ముజీబ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌ను బాదాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇది రెండో బిగ్గెస్ట్‌ సిక్సర్‌ కావడం విశేషం.
    living stone
    లివింగ్​ స్టోన్​

అదిరిపోయే క్యాచ్‌లు..

  • Super catches in 2021: ఎంత అద్భుతంగా బౌలింగ్‌ చేసినా.. క్యాచ్‌లను నేలపాలు చేస్తే కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. బౌండరీ వెళ్లే బంతిని ఆపి ఒక్క పరుగే రానిస్తే.. అది సూపర్‌ ఫీల్డింగ్‌ అంటాం కదా.. అలానే దూరంగా, వేగంగా గాల్లోకి లేచిన బంతిని ఒడిసి పట్టుకుంటే సూపర్‌ క్యాచ్‌ అవుద్ది. ఒకే ఒక్క క్యాచ్‌తో మ్యాచ్‌ రూపురేఖలు మారిపోయే అవకాశమూ ఉంది. టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్‌ వంటి మెగా టోర్నీల్లో ఈ ఏడాది అలాంటి అద్భుతమైన క్యాచ్‌లు ఎవరు పట్టారంటే..
  • టీ20 ప్రపంచకప్‌లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు మారక్రమ్‌ అద్భుతమైన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. స్టీవ్‌ స్మిత్‌ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్‌ వద్ద పరిగెత్తుతూ వచ్చి అందుకున్న విధానం అదుర్స్.
  • పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో డేవన్‌ కాన్వే అందుకున్న క్యాచ్‌ సూపర్‌ అని చెప్పాలి. అల్లంతదూరంలో వస్తున్న బంతిని.. దూకి మరీ ఒడిసిపట్టుకోవడం అద్భుతం. టీ20 ప్రపంచకప్‌లో ఇదొక సెన్సేషన్‌ క్యాచ్‌గా మిగిలిపోయింది.
  • ఇక ఐపీఎల్‌ సంగతికొస్తే.. కేకేఆర్‌, పంజాబ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రవి బిష్టోయ్‌ (పంజాబ్‌) పట్టిన క్యాచ్‌ టోర్నీకే హైలైట్‌. సునిల్‌ నరైన్ ఇచ్చిన క్యాచ్‌ను బిష్టోయ్‌ దాదాపు 20 అడుగుల దూరం నుంచి పరిగెత్తుకొచ్చి మరీ డైవ్‌ చేసి అందుకున్నాడు.
  • ఈ సారి రాజస్థాన్‌ ఆటగాడు యశస్వి జైస్వాల్ వంతు. కేకేఆర్‌ బ్యాటర్ సునిల్‌ నరైన్‌ కొట్టిన బంతి తక్కువ ఎత్తులో గాల్లోకి లేచింది. లాంగాన్‌లో ఉన్న యశస్వి దాదాపు మైదానం సగం లోపలికి వచ్చి బంతిని ఒడిసి పట్టాడు.
  • చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు మనీశ్‌ పాండే (61) మాంచి ఊపు మీదున్నాడు. ఇదే క్రమంలో ఎంగిడి బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించాడు.
  • అయితే బౌండరీ లైన్‌ వద్ద డుప్లెసిస్‌ సూపర్‌ క్యాచ్‌ అందుకోవడంతో మనీశ్ నిరాశగా పెవిలియన్‌కు చేరాడు.
    dhoni
    ధోనీ

సూపర్‌ స్టంప్పింగ్‌లు‌‌..

  1. Super Stunnigs in 2021: మ్యాచ్‌ మొత్తం కీపర్‌ గ్రిప్‌లో ఉన్నట్లుగా ఉంటుంది. బ్యాటర్‌ కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వికెట్ల వెనుక కీపర్‌ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఫాస్ట్‌ బౌలింగ్‌ అయితే బౌన్స్‌ అయ్యే బంతులను ఒడిసిపట్టుకోవాలి. అదే స్పిన్‌ బౌలింగ్‌లో ఎప్పుడూ సవాలే. గింగరాలు తిరుగుతూ వచ్చే బంతిని కచ్చితంగా అంచనా వేసి పట్టుకోవాలి. బ్యాటర్‌ అదుపు తప్పితే స్టంప్‌ఔట్ చేయాలి. మరి మన ఆటగాళ్లు ఈ ఏడాదిలో చేసిన అత్యుత్తమ స్టంపింగ్‌లు ఇవే...
  2. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో సబ్‌స్టిట్యూట్‌ కీపర్‌గా వచ్చిన టీమ్‌ఇండియా ఆటగాడు కేఎస్‌ భరత్ చేసిన స్టంపింగ్‌ అత్యుత్తమమైన వాటిల్లో ఒకటి. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ముందుకు వచ్చి ఆడేందుకు యత్నించిన కివీస్‌ ఆటగాడు టామ్‌ లాథమ్‌ ప్యాడ్స్‌కు తాకి బంతి వెనక్కి వెళ్లింది. అప్పటికే వికెట్ల వెనుక కాచుకుని ఉన్న కేఎస్ భరత్‌ చక్కగా ఒడిసిపట్టుకుని వికెట్లను గిరాటేశాడు.
  3. అత్యుత్తమ సారథి, వికెట్‌ కీపర్లలో ఎంఎస్ ధోనీ ముందు వరుసలో ఉంటాడు. ఫ్రంట్‌కు వచ్చి షాట్‌ ఆడేందుకు యత్నించే బ్యాటర్‌ పొరపాటున బంతిని మిస్ చేస్తే మాత్రం కచ్చితంగా ఔటైనట్లే. అంత పకడ్బందీగా స్టంప్‌ చేస్తాడు మహేంద్రుడు. ఇలాంటి పరిస్థితి శిఖర్ ధావన్‌కు ఎదురైంది. ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే బౌలర్ మొయిన్‌ అలీ బౌలింగ్‌లో దిల్లీ బ్యాటర్ శిఖర్‌ ముందుకొచ్చి ఆడేందుకు యత్నించాడు. అయితే బంతిని కొట్టడంలో శిఖర్‌ విఫలమైనా.. ధోనీ మాత్రం వికెట్లను గిరాటేయడం మాత్రం వదల్లేదు.

ఇదీ చూడండి: ఈ ఏడాది టెస్టుల్లో 'సూపర్ స్టార్స్' వీరే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.